Anu Emmanuel : టాలీవుడ్ లోకి నాచురల్ స్టార్ నాని మజ్ను చిత్రంతో హీరోయిన్ గా అను ఇమ్మానుయేల్ ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలో నటించిన అవి ఆడక పోయేసరికి అనూ కెరియర్ డీలా పడిపోయింది. కిట్టూ ఉన్నాడు జాగ్రత్త, ఆక్సిజన్ చిత్రాలు పర్వాలేదు అనిపించాయి. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి, అల్లు అర్జున్ సరిలేరు నీకెవ్వరు చిత్రంలో కూడా నటించింది. అదేవిధంగా అక్కినేని వారసుడు నాగచైతన్య తో శైలజా రెడ్డి చిత్రంలో నటించింది. దాదాపు టాప్ హీరోలందరితో నటించిన అను ఇమ్మానుయేల్ కి ఆవగింజంత అదృష్టం కూడా ఉంటే బాగుండేదని అనిపిస్తుంది.
తను నటించిన ప్రతి సినిమా ఫ్లాప్ అవడంతో ఇండస్ట్రీలో అను ని ఐరన్ లెగ్ గా ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. అయినా అను ఇమ్మానుయేల్ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా.. తన నటననే నమ్ముకొని. టాలీవుడ్ ఇండస్ట్రీ పైనే ఆధారపడి ఉంది.
స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ తమ్ముడిగా అందరికీ సుపరిచితమైన అల్లు శిరీష్.. కొత్తజంట చిత్రంతో ప్రేక్షకులో గుర్తింపు సంపాదించుకున్నాడు. హీరోయిన్ లావణ్య త్రిపాఠి తో చేసిన శ్రీరస్తు శుభమస్తు సినిమా కూడా పర్లేదు అనిపించింది . అల్లు శిరీష్ ఎన్నో సినిమాలు చేసిన.. ఒక్క సినిమా కూడా సరైన హిట్ తగలక పోవడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో సరైన గుర్తింపు రాలేదని చెప్పవచ్చు. ప్రస్తుతం “ప్రేమ కాదట” అనే చిత్రంలో అల్లు శిరీష్ నటిస్తున్నాడు.
టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కూడా అల్లు శిరీష్ పేరు సంపాదించుకున్నాడు. అయితే డేటింగ్, రొమాన్స్ వంటి వ్యవహారాలకు దూరంగా ఉండే ఈ అల్లు వారసుడు హీరోయిన్ అను ఇమాన్యుల్ తో ప్రేమలో ఉన్నట్లు ప్రచారాలు జరుగుతున్నాయి. వీరిద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో నిజం ఎంత ఉందో అబద్ధమెంతో ఉందో తెలియదు కాని.. వీటిపై వారిద్దరూ ఎప్పుడు స్పందించకపోవడం రూమర్లకు తావిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా అను ఇమ్మానుయేల్ ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.