Anupama : అనుపమ.. తెలుగు రాష్ట్రాల కుర్రకారులకు పరిచయం అక్కర్లేని పేరు… మొదట తెలుగు ఇండస్ట్రీలో ఆమె కొట్టిన వరుస హైట్రిక్ విజయాలను చూసి.. ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా నిలుస్తుందని అందరూ అనుకున్నారంతా.. కానీ చివరికి అనుపమ ఊహించని విధంగా చతికల పడింది.
అరకొర సినిమాలు చేస్తూ ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో నెట్టుకొస్తుంది. ఇక సోషల్ మీడియా విషయానికొస్తే ఇన్స్టాగ్రామ్ లో అనుపమ ఎంత ఆక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎప్పుడు సోషల్ మీడియాలో అదిరిపోయే ఫోటో షూట్ లతో కుర్రాళ్ళ మతి పోగొడుతుంది.
ఇప్పటివరకు అనుపమ అన్ని ట్రెడిషనల్ పాత్ర లోనే కనిపించింది.. ఇటీవల విడుదలైన దిల్ రాజ్ అన్న కొడుకు ఆశిష్ రెడ్డి హీరోగా వచ్చిన ‘రౌడీ బాయ్స్’ మూవీలో అనుపమ హీరోయిన్‌గా గ్లామర్స్ రోల్ చేసింది. ఇప్పటివరకు లిప్ లాక్ లకు దూరంగా ఉన్న అనుపమ.. ఈ చిత్రం కోసం 5 లిప్ లాక్ లకు ఓకే చెప్పిందట.
ఇటీవలే విడుదలైన రౌడీ బాయ్స్ చిత్రంలో అనుపమ ముద్దులు రొమాన్స్ తో రెచ్చిపోయింది. మొన్నటివరకు తెలుగు తమిళ్ మలయాళం కన్నడ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో బిజీబిజీగా గడిపిన అనుపమ..ప్రస్తుతం చేతిలో సినిమాలు లేకనే గ్లామరస్ రోల్స్ కి ఓకే చెప్పిందని ఇండస్ట్రీ వర్గాలో చర్చ నడుస్తుంది.
ఈ కేరళ కుట్టి సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. ఈ మేరకు లేటెస్ట్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు ఫాలోవర్స్ తో పంచుకుంటూ ఉంటుంది. అయితే తాజాగా అనుపమ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షించింది.
అప్పట్లో ఆమె ఓ మూవీలో గర్భవతిగా నటించిన ఫోటోలను షేర్ చేసింది. అందులో తనతో పాటు తన తండ్రి కూడా ఉన్నాడు. అయితే ఆ ఫోటోలను చూసిన వారందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ క్రమంలో కమెడియన్ విద్యు రామన్ కూడా షాక్ అయ్యి..నిజంగా అనుపమకు కంగ్రాట్స్ చెప్పే ప్రయత్నం చేసింది. ఇటీవలే హీరో నిఖిల్ కి జోడిగా అనుపమ నటించిన కార్తికేయ 2 చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.
అనుపమ మలయాళం ఇండస్ట్రీ ద్వారా వెండితెరకు పరిచయమైంది. హీరో నితిన్ నటించిన ఆఆ సినిమాలో నాగవల్లి పాత్రలో అనుపమ అందరినీ ఆకట్టుకుంది. ఆతర్వాత శతమానం భవతి, ప్రేమమ్ వంటి చిత్రాలతో టాలీవుడ్ లో తనకంటూ ఇమేజ్ ను సృష్టించుకుంది ఈ కేరళ బ్యూటీ అనుపమ.