Ariyana Glory : బిగ్ బాస్ షో తరువాత స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న బోల్డ్ బ్యూటీ అరియనా గ్లోరి.. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎవరూ అందుకోలేని వేగంతో దూసుకు వెళ్తుంది. బిగ్ బాస్ షో లో ఫైటర్ గా అరియనా మంచి గుర్తింపును పొందింది. అలాగే ప్రస్తుతం పలు వెబ్ సిరీస్ లో, షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తూ సత్తా చాటుతోంది. మొదట యాంకర్ గా తన కెరీర్ ని ప్రారంభించిన అరియనా.. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూతో విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది.. అందులో ఆర్జివి అరియనా పై చేసిన బోల్డ్ కామెంట్స్ సోషల్ మీడియాలో దుమారం రేపాయి. దీంతో అరియనా ప్రేక్షకుల దృష్టిలో పడింది.
ఆ తర్వాత బిగ్ బాస్ షో లో అరియనాకు అవకాశం వచ్చింది. తాను బోల్డ్ గర్ల్ అంటూ పరిచయం చేసుకోని బిగ్ బాస్ సీజన్ 4 లోకి ఎంట్రీ ఇచ్చింది. హౌస్ లో అరియనా సోహెల్ ఫైట్.. టామ్ అండ్ జెర్రీ ని తలపించింది. అలాగే అరియనా అవినాష్ మధ్యలో లవ్ ట్రాక్ నడుస్తోందని అందరూ భావించారు. కానీ వాళ్ళ మధ్య ఉన్నది స్నేహమే అని.. ఇటీవలే అవినాష్ పెళ్లి తో కన్ఫామ్ అయింది. అయితే బిగ్ బాస్ హౌస్ లో నుండి బయటకు వచ్చిన తర్వాత అరియనా ఫ్రెండ్స్ తో పార్టీలన్నీ ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్గా ఉంటూ. లేటెస్ట్ అప్ డేట్స్ అన్ని ఫాలోయర్స్ తో పంచుకుంటుంది.
ఇటీవల జరిగిన బిగ్బాస్ నాన్ స్టాప్ లో కంటెస్టెంట్ గా మళ్ళీ ఈ బోల్డ్ బ్యూటీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మునుపటిలా కాకుండా ఈసారి అరియన హౌస్ లోకి ఫుల్ ఫాలోయింగ్ తో వచ్చింది. ఈ మేరకు హౌస్ లో గత సీజన్ లో కంటే ఎక్కువ రెచ్చిపోయింది బోల్డ్ బ్యూటీ… ఇదిలా ఉంటే తాజాగా ఆమె నాభి అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది. దీంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. దానిపై నేటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. నడుము జాగ్రత్త.. కేర్ తీసుకో.. షేప్ అవుట్ అవుతుందంటూ కామెంట్లు పెడుతున్నారు.