Catherine tresa : కేథరిన్ త్రెసా.. ఈ పేరు కుర్రకారులకు కొత్తగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఇద్దరమ్మాయిలతో సినిమాతో తెలుగు కుర్రకారు మనసులను కొల్లగొట్టిన కేథరిన్.. ఆ సినిమా తర్వాత ఆమె యూత్ లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకుంది. అనంతరం పైసా ఎర్ర బస్సు వంటి చిత్రాల్లో ఈమె నటించిన ఆ సినిమాలు ఫ్లాప్ అవడంతో ఆమెకు గట్టి దెబ్బ పడింది.
ఆ తర్వాత రుద్రమదేవి సినిమాలో మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలోనే కేథరిన్ నటించింది. అలాగే మళ్లీ బ్యాక్ టు బ్యాక్ అల్లు అర్జున్ తో సరైనోడు చిత్రంలో ఎమ్మెల్యే పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయింది. అయితే ఎందుకో తెలియదు కానీ ఆమెకు మూవీ ఆఫర్స్ తగ్గిపోయాయి.
దీంతో అందివచ్చిన ఏ పాత్రకైనా సై అంది. ఈ నేపథ్యంలో నేనే రాజు నేనే మంత్రి సినిమాలో నెగిటివ్ రోల్ కూడా చేయడానికి వెనుకాడలేదు. అలాగే జయ జానకి నాయక సినిమాలో ఓ ఐటెం సాంగ్ కూడా చిందేసింది. ఇక ఈ ముద్దుగుమ్మ చివరగా వరల్డ్ ఫేమస్ లవర్, భళా తందనాన చిత్రాల్లో మెరిసింది. ఈమధ్య కేథరిన్ అందాల ఆరబోత పై ఫోకస్ పెట్టింది. నిత్యం ఫోటో షూట్లతో వార్తల్లో నిలుస్తుంది. తాజాగా తన తెల్లటి అందాలను కుర్రాలకు వడ్డించింది.