Deepthi Sunaina : ఈరోజుల్లో సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతోమంది అమ్మాయిలు తెలుగు రాష్ట్రాల్లో సెలెబ్రిటీలుగా మారుతున్నారు . అదే కోవకు చెందినదీ ఈ దీప్తి సునైనా.. ఇప్పుడు ఈ పేరు యావత్ తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తెలుగు బిగ్బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి క్యూట్ గర్ల్ గా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైంది. తన అందంతో డాన్స్ తో నిత్యం సోషల్ మీడియాలో రచ్చ లేపుతూ ఉంటుంది.
గతంలో షన్ను దీప్తి ల లవ్ బ్రేకప్ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయిదేళ్లుగా ప్రేమలో కొనసాగిన వీళ్లు ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడం అందరిని షాక్ కి గురిచేసింది. బిగ్ బాస్ ఫినాలే వరకు షణ్ముఖ్ ని సపోర్ట్ చేస్తూ వచ్చిన దీప్తి.. ఆ రియాల్టీ షో ముగిసిన తర్వాత ఇలాంటి సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంటుందని ఎవరూ ఊహించలేదు.కానీ హౌస్ లో నుండి షణ్ముక్ బయటకు వచ్చిన తర్వాత.. దీప్తి షన్ను తో తెగదింపులు చేసుకోబోతున్నట్లు మార్పు తప్పదు వంటి కొటేషన్లు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ ఫాలోవర్స్ కి హింట్స్ ఇస్తూ వచ్చింది.
షణ్ముక్ తో బ్రేకప్ తర్వాత దీప్తి సునైనా తన కెరియర్ పై ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. షన్ను తో ప్రేమాయణానికి స్వస్తి పలికిన తర్వాత నుండి దీప్తి సోషల్ మీడియాలో ఫుల్ ఆక్టివ్ గా ఉంటుంది. ఇటీవలే దీప్తి సునైనా బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో అవీ క్షణాల్లో వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే తాజాగా దీప్తి షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఆ ఫోటోలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. పలువురు దీప్తి సునయన ఫోటోలో చేతి అడ్డు పెట్టుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసుకున్నారు. అలాంటి డ్రెస్సు వేసుకోవడం ఎందుకు మళ్లీ చేతి అడ్డు పెట్టడం ఎందుకు అంటూ కామెంట్లు పెడుతున్నారు.