Dethadi Harika : ఈరోజుల్లో సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతోమంది అమ్మాయిలు తెలుగు రాష్ట్రాల్లో సెలెబ్రిటీలుగా మారుతున్నారు. అదే కోవకు చెందినదీ ఈ అలేఖ్య హారిక..ఈ అలేఖ్య హారిక అంటే ఎవరికీ పెద్దగా తెలీదు.. దేత్తడి హారిక అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా ఇట్టే గుర్తు పట్టేస్తారు. దేత్తడి అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలంగాణ యాసలో పొగరు ఉన్న అమ్మాయిగా హారిక తెలుగు రాష్ట్ర ప్రజలకు పరిచయం అయింది.
అతి తక్కువ సమయంలో మంచి పాపులారిటీ సంపాదించుకుంది హారిక. అదేవిధంగా గత బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొన్న దేత్తడి హారిక తన క్యూట్ బిహేవియర్ తో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో అప్పటి వరకు తన పాపులారిటీ సోషల్ మీడియా వరకే పరిమితం..కానీ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాక బుల్లితెర ప్రేక్షకుల మనసును కూడా గెలుచుకుంది.
దీంతో హారిక కు తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఈ మేరకే బిగ్బాస్ సీజన్ 4 లో టాప్ 5 కంటెస్టెంట్ గా దేత్తడి హారిక స్థానం సంపాదించుకుంది. ఆ తర్వాత కూడా యూట్యూబ్ లో హారిక తన మార్క్ ని కంటిన్యూ చేస్తోంది.ముఖ్యంగా దేత్తడి సిరీస్ తో హారికకు మంచి గుర్తింపు లభించింది అని చెప్పవచ్చు. యూట్యూబ్ లో ”ఏమండోయ్ ఓనర్ గారు” అనే వెబ్ సిరీస్ చేసి ఇటీవలే అమ్మడి అనే ఆల్బమ్ కూడా చేసి హిట్ కొట్టింది.
సోషల్ మీడియాలో హారిక ఎప్పుడూ ఆక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఆమె డిఫరెంట్ లుక్ లో అందాలు ఆరబోస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి…కుర్రకారు గుండెల్లో సెగలు రేపుతోంది. క్యూట్ గా ఉండే హారిక ఇలా హీరోయిన్లకు పోటీ ఇచ్చే విధంగా రెచ్చిపోయి ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో.. కుర్రాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అయితే ప్రస్తుతం దేత్తడి హారిక పలు వెబ్ సిరీస్ లో చిత్రాల్లో నటిస్తూ బిజీబిజీగా గడుపుతోంది