Hero : ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కేవలం ఒక చిన్నపాటి కానిస్టేబుల్ గవర్నమెంట్ ఉద్యోగి కుటుంబం నుంచి సినిమా ఇండస్ట్రీకి వచ్చి మెగా స్టార్ గా ఎదిగినటువంటి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి దాదాపుగా సౌతిండియాలోని తెలియనివారుండరు. అయితే కేవలం నటుడు చిరంజీవి కేవలం సినిమాల్లో హీరోగా మాత్రమే కాకుండా రియల్ లైఫ్లో కూడా ఎంతోమందికి రక్తదానం, కంటి దానం వంటి ఆసుపత్రులను నిర్మించి సేవ చేస్తూ నిజమైన హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. 150కి పైగా చిత్రాల్లో నటించి మరియు ఇప్పటికీ నటిస్తూ ఇప్పటికీ నేటితరం నటీనటులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. అలాగే ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి కూడా వచ్చి సొంతంగా పార్టీని స్థాపించాడు. కానీ పలు రాజకీయ పరిస్థితుల కారణంగా ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అనంతరం పర్యాటక అభివృద్ధి శాఖ మంత్రిగా కూడా పనిచేశారు.
అయితే తాజాగా హీరో మెగాస్టార్ చిరంజీవి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు సోషల్ మీడియా మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి అభిమాని మెగాస్టార్ చిరంజీవి కాలేజీలో చదువుతున్న సమయంలో తన స్నేహితులతో కలిసి దిగినటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో కొందరు మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఈ ఫోటోలు షేర్ చేస్తూ చేస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నటుడు మెగాస్టార్ చిరంజీవి కి ఆరు పదుల వయసు పైబడినప్పటికీ ఇప్పటికీ యంగ్ గా కనిపిస్తూ హీరోగా నటిస్తూ దూసుకుపోతున్నాడు. అయితే ఈ క్రమంలో ఇటీవల నటుడు మెగాస్టార్ చిరంజీవి తెలుగులో ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహించిన ఆచార్య అనే చిత్రంలో హీరోగా నటించాడు. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో సరైన హిట్ లేక సతమతమవుతున్న చిరంజీవి ప్రస్తుతం బోలా శంకర్ మరియు గాడ్ ఫాదర్ అనే రెండు యాక్షన్ చిత్రాలలో హీరోగా నటిస్తున్నాడు. కనీసం ఈ చిత్రాలైనా హీరో మెగాస్టార్ చిరంజీవికి తెచ్చిపెడతాయి లేదో చూడాలి.