Dimple Hayati : డింపుల్ హయాతి… ఈ పేరును తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. మాస్ మహారాజ్ రవితేజ ఖిలాడి మూవీతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ చిత్రంలో అద్భుతమైన నటన కనబరిచి.. కుర్రకారు హృదయాలను గెలుచుకుంది. ఆ తర్వాత గోపీచంద్ రామబాణం చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించింది. అయితే ఆ సినిమా ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేదు. అయితే అందరికీ సరిగా గుర్తుందో లేదో వరుణ్ తేజ్ హీరోగా నటించిన గద్దలకొండ గణేష్ చిత్రంలో ఈ అమ్మడు ఓ పాటకు డాన్స్ చేసింది.
సూపర్ హిట్టు నీ హైటూ.. సూపర్ హిట్టూ మీసకట్టు అనే స్పెషల్ సాంగ్ కి ఈ హైదరాబాద్ బ్యూటీ చిందు వేసింది. అయితే ఈ పాట తర్వాత అందరూ ఆమెకు ఐటెం సాంగ్స్ చేసే అవకాశలు మాత్రమే వస్తాయని అందరూ ఊహించారు. అనూహ్యంగా ఆమె అందం, అభినయానికి వరుస మూవీ ఆఫర్స్ వచ్చాయి. ఇదిలా ఉంటే ఈ డస్కు బ్యూటీ అందాలు ఆరబోస్తూ సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తుంది. దీంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.