Disha Patani : మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన లోఫర్ చిత్రంతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దిశా పటాని.. ఆ తర్వాత తెలుగులో ఏ చిత్రాలు చెయ్యలేదు. హిందీలోనే బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ బాలీవుడ్లో బిజీ అయిపోయింది ఈ బ్యూటీ..ఎమ్‌ఎస్ ధోనీ, భాగీ వంటి బ్లాక్బస్టర్ సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది.
అలాగే బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్‌తో దిశా పటాని ప్రేమాయణం నడిపిస్తున్నట్లు సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ బ్యూటీ ఫిట్నెస్ ఎక్కువ శ్రద్ధ పెడుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో రెగ్యులర్ గా దిశా జిమ్ కి వెళ్లి కసరత్తులు చేస్తూ ఉంటుంది.
ఈ మేరకు సోషల్ మీడియాలో అప్పుడప్పుడు జిమ్ చేస్తున్నా వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా దిశా పటాని అందాలను వడించింది. దీంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇక సినిమాల విషయానికి వస్తే.. దిశా సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన కరణ్ జోహార్ యాక్షన్ డ్రామా ‘యోధా’ , సినిమా షూటింగ్ ను విజయవంతంగా పూర్తి చేసింది. అలాగే ఆమె నటించిన ఏక్ విలన్ 2 సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం సత్తా చాటాలంటే.. హీరోయిన్ హీరోయిన్ లకు బాడీ ఫిట్ గా ఉండడం ముఖ్యం … దీంతో వాళ్లు ఫిట్నెస్ పై ఎంతో శ్రద్ధ పెడుతూ ఉంటారు. అదేవిధంగా దిశా పటాని కూడా సైజ్ జీరో బాడీ కోసం జిమ్ లో గంటల తరబడి శ్రమిస్తూ ఉంటుంది.