Divi : బిగ్ బాస్ సీసన్ 4 లో కాంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన దీవి..హౌస్ లో సత్తా చాటడంతో ప్రేక్షకుల దృష్టి ఆకర్షించింది. అప్పటి వరకు ఎవరికీ తెలియని దీవి బిగ్ బాస్ షో తో ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయింది. తన అందచందాలతో కుర్రాళ్ల మతి పోగొడుతుంది. ఈ బ్యూటీ మహర్షి వంటి పలు చిత్రాల్లో నటించింది. ఈ సొట్టబుగ్గల సుందరి కి చిన్న సినిమాల్లో నటించడానికి అవకాశాలు వస్తున్నాయి. మోడల్ గా ప్రస్థానం మొదలుపెట్టిన దీవి.. ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ సొట్టబుగ్గల సుందరి ఇటు వెబ్ సిరీస్ లో నటిస్తు..అటు సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా పోతుంది.
ఇటీవలె దీవి మోస్ట్ డిజైరబుల్ టైటిల్ ని గెల్చుకున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ ఎప్పుడు యాక్టివ్గా ఉంటూ లేటెస్ట్ ఫోటోస్ ని షేర్ చేస్తూ ఉంటుంది. ఈ మేరకు తాజాగా దీవి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
అయితే దీవి నటించిన నయం డైరీస్ చిత్రం ఇటీవలే విడుదల అయ్యింది. అందులో ఈ సొట్టబుగ్గల సుందరి రొమాన్స్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. హగ్‌లు, ముద్దులతో రెచ్చిపోయిన దివి ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ సిరీస్ పోలీసుల కాల్పుల్లో మృతిచెందిన గ్యాంగ్‌స్టర్ నయీం జీవిత కథతో ‘నయీం డైరీస్’ తెరకెక్కింది.
ఈ చిత్రానికి దాము బాలాజీ దర్శకత్వం వహించారు. అలాగే వశిష్ఠ సింహ మెయిన్ రోల్ లో నటిస్తున్నాడు. సీఏ వరదరాజు నిర్మాత. నయీం అనే గ్యాంగ్‌స్టర్ గా తయారు కావడానికి దారి తీసిన పరిస్థితులన్నీ ఇందులో కళ్లకు కట్టే విధంగా చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు బాలాజీ. గ్యాంగ్ స్టార్ నయీమ్ చేసిన అసాంఘిక కార్యక్రమాలు, అతను డైరీలో రాసుకున్న విషయాలు ఏంటనేవి ఈ చిత్రంలో చూపెట్టారు. అలాగే ఈ చిత్రంలో వశిష్ఠ సింహ యాక్టింగ్ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. యజ్ఞశెట్టి, దివి, బాహుబలి నిఖిల్, శశికుమార్ తదితరులు చిత్రంలో సందడి చేశారు.