Esther Anil : మనం వెండి తెరపై పలు చిత్రాల్లో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ లను చూస్తూ ఉంటాం.. వారు కొంచెం పెద్దయ్యాక చూస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. వారిని చూసి ఎంత పెద్దగా ఎదిగారో అని అవాక్కైన సందర్భాలు ఎన్నో ఉంటాయి. మొన్నటివరకు బుల్లితెరలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన చిన్నారి పెళ్ళికూతురు సీరియల్లో బాలనటిగా నటించిన అవికా గోరా. ఇప్పుడు ఎంత అందంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. చిన్నారి పెళ్ళికూతురు.. అప్పుడే పెద్ద కూతురు అయిపోయింది. జై చిరంజీవ సినిమాలో చిన్నారిగా నటించిన శ్రీయ శర్మ అప్పుడే హీరోయిన్ అయిపోయింది.
ఇప్పుడు ఆ జాబితాలో మరో హీరోయిన్ కూడా చేరబోతోంది. ఎస్తేర్ అనిల్.. తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు అంతా సుపరిచితం కాకపోయినా… దృశ్యం చిత్రంలోని హీరో వెంకటేష్ చిన్న కూతురు అంటే ఎవరైనా గుర్తు పడతారు. ఇప్పుడు ఈ పాప ఎలా ఉందో చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. అప్పుడు క్యూట్ గా ఉన్న ఎస్తేర్.. ఇప్పుడు హాట్ గా మారింది. ఒరిజినల్ దృశ్యం సినిమా మొదట మలయాళంలో విడుదలైన చిత్రంలో ఎస్తేర్ అనిల్ నటించింది. అదే విధంగా తెలుగులోనూ కూడా తానే నటించింది. ఈ సినిమా 2014లో రిలీజ్ అయింది. ఈ సినిమా చేస్తున్నప్పుడు ఎస్తేర్ వయసు 12 ఏళ్ళు… కానీ ఇప్పుడు తన వయసు 19 సంవత్సరాలు…
ఇక సినిమాల విషయానికొస్తే ఈ కేరళ కుట్టి ఇటీవల తెలుగుల్ ఆహా ఓటిటిలో రిలీజ్ అయిన ఒక సినిమాలో హీరోయిన్ గా నటించింది. పెద్ద పెద్ద చిత్రాల్లో అవకాశం కోసం వేచి చూస్తోంది. అదేవిధంగా దృశ్యం 2 లో కూడా వెంకటేష్ చిన్న కూతురు గా ఈ కేరళ కుట్టె నటించింది. దీంతో ఈ చిత్రం విడుదల తర్వాత.. తెలుగులో కూడా మంచి అవకాశాలు వస్తాయని.. సినిమాలో చేయడానికి దర్శకనిర్మాతలు ఛాన్స్ ఇస్తారని ఎస్తేర్ ఆశించింది. ఈ ముద్దుగుమ్మకు కేరళలో కూడా మంచి అవకాశాలే వస్తున్నాయి. స్టార్ హీరోలతో ఒకట్రెండు సినిమాలు పడితే కచ్చితంగా కెరీర్ సెట్ అయిపోతుంది.