Faria Abdullah : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోకి “జాతి రత్నాలు” సినిమాతో హీరోయిన్ గా ఫరియా అబ్దుల్లా ఎంట్రీ ఇచ్చింది. జాతి రత్నాలోని చిట్టి గా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ చెరిగిపోలేని స్థానాన్ని సంపాదించుకుంది. వాస్తవానికి ఫరియా హీరోయిన్ గా పరిచయం కాకముందే.. యూట్యూబెర్ గా హైదరాబాద్ కుర్ర కార్లకు సుపరిచితమే. ఇప్పుడు ఫరియా అబ్దుల్లా వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో దూసుకెళ్తుంది. ఈ హైదరాబాద్ బ్యూటీకి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఇటు సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉంటు.. డ్యాన్స్ ,యోగ కి సంబంధించిన ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. దీంతో తాజాగా ఫరియా షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.
ఇక సినిమాల విషయానికొస్తే ఇటివలే కింగ్ అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన బంగార్రాజు సినిమాలోని ఓ ఐటెం సాంగ్ కి చిట్టి చిందు వేసింది. అదేవిధంగా మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న `ఢీ అండ్ ఢీ` చిత్రంలో హీరోయిన్‌గా ఫరియా అబ్దుల్లా చేస్తోందట. మాస్ మహారాజ్ రవితేజతోనూ ఓ సినిమాలో నటిస్తోంది.