Kiara Advani : తన అందం, అభినయం, నటనతో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన కీయారా అద్వాని గురించి తెలుగు వారికి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హిందీలో వరుస సినిమాలు చేస్తూ.. బాలీవుడ్లో కీయారా తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లోకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ చిత్రంతో హీరోయిన్ గా కీయారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.అయితే ఈ ముద్దుగుమ్మ నిత్యం ఏదో విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా కైరా అద్వాని సిద్ధార్థ మల్హోత్రా తో ప్రేమలో ఉన్నట్లు ఎప్పటి నుండో ప్రచారాలు జరుగుతున్నాయి.
సోషల్ మీడియాలో ఆ వార్తలపై ఎంత రచ్చ జరుగుతున్నా వాళ్ళిద్దరూ ఎప్పుడు స్పందించకపోవడం..ఆ వార్తలకు బలాన్ని చేకూర్చింది. అయితే ఎప్పటికప్పుడు వారి ప్రేమ విషయాన్ని ఓపెన్ అవ్వకుండా వారిద్దరూ కంటిన్యూ అవుతూ వస్తున్నారు.అయితే అప్పుడప్పుడు ఇద్దరూ కలిసి హాలిడే లొకేషన్స్ కి వెళ్లడం, ముంబై రోడ్లపై చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో మీడియా కంట పడేవారు.అలాగే కీయారా అద్వాని సిద్ధార్థ్ మల్హోత్రా ఇంటికి వెళ్లి అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉండేది. దీంతో ఫోటోలు వైరల్ గా మారేవి.
గత కొద్ది రోజుల క్రితం వీళ్లిద్దరూ వివాహం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే.వీరిద్దరూ ఇటీవల నటించిన షార్జా సినిమా షూటింగ్లో వీరిద్దరి మనసులు దగ్గరయ్యాయి. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం కీయారా నాలుగైదు ప్రాజెక్టులకు సైన్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే తెలుగులో రామ్ చరణ్ తో మరోసారి జతకట్టబోతుంది.