Hariteja : హరితేజ.. తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నితిన్ హీరోగా తివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన “అఆ” అనే మూవీతో తెలుగు ప్రేక్షకులకు మంగమ్మ అనే పాత్రతో పాత్రతో దగరయింది హరితేజ..
అయితే ఆ మూవీ తర్వాత హరితేజకు ఆశించినంతగా మూవీ ఆఫర్స్ రాలేదు. అయినా
ఈ ముద్దుగుమ్మ మళ్లీ సీరియల్స్ వైపు కూడా వెళ్లలేదు.
పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. ఈమె ఇండస్ట్రీలో సూర్యకాంతంలా పేరు సంపాదించుకుంది. ఈ బ్యూటీ బిగ్ బాస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.
ఆ షో ద్వారా కూడా ఆమె మంచి పాపులారిటీనే సంపాదించుకుంది. అందులో ఆమె థర్డ్ ప్లేస్ ని భర్తీ చేసుకుంది. అప్పట్లో ఈ ముద్దుగుమ్మ కాస్తగా బొద్దుగా లావుగా ఉండేది… కానీ తాజాగా ఈమె మూవీ ఆఫర్స్ రావడం కోసం ఏమో నాజుగా తయారైంది. డైట్ చేసి.. ఫిట్ గా మారింది.
అయితే ఇప్పటి తో పోలిస్తే బొద్దుగానే హరి తేజ బాగుందని పలువురు నెటిజన్లు ఆమె షేర్ చేసిన ఫోటోల కింద కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ ముద్దుగుమ్మ బుల్లితెరలో యాంకర్ గా సీరియల్స్ లో నటిగా కొన్నేళ్లు రాణించింది. ముత్యమంతా పసుపు, మనసు మమత వంటి పాపులర్ సీరియల్స్ లో ఈమె సందడి చేసింది. అత్తారింటికి దారేది, దువ్వాడ జగన్నాధం, విన్నర్, రాజా ది గ్రేట్, దమ్ము వంటి ప్రముఖ సినిమాలో కూడా ఈమె నటించింది.