Hebah Patel : హీరోయిన్ హెబ్బా పటేల్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. యంగ్ హీరో రాజ్ తరుణ్ కుమారి 21ఎఫ్ చిత్రంలో హెబ్బా అద్భుతమైన నటన ప్రతిభను కనబరిచి.. తన అందంతో తెలుగు కుర్ర కారుల హృదయాలను గెలుచుకుంది. 2015లో విడుదలైన ఆ సినిమాతో హెబ్బా పటేల్ యూత్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది. దీంతో హెబ్బ పటేల్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుందని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు.. ఏమైందో తెలియదు గానీ హెబ్బా పటేల్ సినీ కెరీర్ పట్టాలు తప్పింది.
ఆ సినిమా తర్వాత ఆడోరకం ఈడోరకం చిత్రంలో ఈమె నటించింది. అయితే ఆ సినిమా అంతగా ఫలితాన్ని ఇవ్వకపోవడంతో.. హెబ్బా కు సినీ అవకాశాలే కరువయ్యాయి. ఆ తర్వాత ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రంలో నిఖిల్ కి సరసన హెబ్బా మెరిసింది. ఆ మూవీ కూడా ఆశించినంత ఫలితాన్ని ఇవ్వకపోవడంతో… అమె సినీ కెరియర్ మరుగున పడిపోయింది. ఇప్పటివరకు హెబ్బా పటేల్ కి స్మాల్ బడ్జెట్ చిత్రాల్లో, యంగ్ హీరోలతో నటించే చాన్సులు మాత్రమే వచ్చాయి. దీంతో ఆమె స్టార్ హీరోయిన్ లిస్టులో స్థానం సంపాదించుకోలేక పోయింది. హీరోయిన్గా అవకాశాలు తగ్గడంతో.. పలు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ లో చిందేస్తుంది ఈ ముద్దుగుమ్మ..
సినిమాల్లో అవకాశాలు రాకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఈమెకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. కెమెరాకు ఫోజులు ఇస్తూ హెబ్బా కుర్రకారును నిద్ర పోకుండా చేస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా హెబ్బా పటేల్ గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫోటోలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.