Ileana : ఇలియానా ఇంత దిగజారడానికి కారణం అదేనా ?

Bharath Cine Desk

Ileana : ఈ రోజుల్లో సెలబ్రిటీలు ఫిట్‌నెస్‌ పై ప్రాణం పెడుతున్నారు. రోజు ఆహారం లేకుండా ఉంటారేమో కానీ వర్కౌట్స్ చేయకుండా అసలు ఉండలేరు. సెలబ్రిటీలు ఫిట్ గా ఉండడానికి పడరాని తిప్పాలని పడుతున్నారు. కొన్ని అనివార్య కారణాలవల్ల వ్యాయామానికి కొంత బ్రేక్ ఇచ్చిన.. ఆ తరువాత మాత్రం రెట్టింపు వర్కౌట్స్ చేస్తూ జిమ్ముల్లో చెమటోడుస్తున్నారు. ఇక హీరో హీరోయిన్ల ఎంత కష్ట పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదే కోవకు చెందిన గోవా సొగసరి ఇలియానా కూడా అంతే.. ఫిట్‌నెస్‌ కోసం పడి చచ్చిపోతుంది.

 

 

ఇలియానా ఫిట్ గా ఉండడానికి ఏమైనా చేస్తుంది.. ఇటివలే వర్కౌట్స్ చేసిన తర్వాత ఇలియానా కొంచెం ఎమోషనల్ అయ్యింది. తన ఫిట్నెస్ టైలర్ గురించి చెబుతూ ఈ గోవా సొగసరి ఏడ్చేసింది. మొదట ట్రైనర్ నా రెండు చేతులతో నా బాడీ ని కౌగిలించుకోమన్నాడు.. నా కోసం నిరంతరం పనిచేస్తున్న బాడీకి అభినందనలు తెలుపామన్నాడు. అతను చెప్పినట్లు నా బాడీని నా కౌగిలిలో బంధించుకున్న.. ఏదో తెలియని మధురానుభూతి నన్ను కుదిపేసింది అంటూ ఇలియానా ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేసింది. దీంతో ఆ పోస్టు అప్పట్లో వైరల్ గా మారింది.

 

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో రాణిస్తున్న సమయంలో.. తీసుకున్న కొన్ని అనుచిత నిర్ణయాల వల్ల ఇలియానా కెరీర్ తలకిందులైంది. బాలీవుడ్లో దునేయాలనే కోరికతో బయల్దేరిన ఇలియానాకు చుక్కెదురైంది.

 

దీంతో ఇలియానా కెరీర్ పట్టాలు తప్పింది. సినిమా అవకాశాలు తగ్గాయి..దీనికితోడు లవ్ ఎఫైర్ లు, బ్రేక్ అప్ లు ఇలియానాని మరింత డిప్రెషన్ లోకి నెట్టాయి. ప్రస్తుతం ఇలియానా, విద్యాబాలన్, నటుడు సెంథిల్ రామమూర్తి కలసి ఓ చిత్రంలో నటిస్తోంది. టాలీవుడ్లో ఈ అందాల తార నటించిన చివరి చిత్రం అమర్ అక్బర్ ఆంటోని… అప్పటినుండి సౌత్ లో ఇలియానా ఏ సినిమాలో చేయలేదు.

 

బాలీవుడ్లో అడపాదడపా సినిమాలు చేస్తూ ఇలియానా కెరీర్ ని నెట్టుకొస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ పోజులతో ఫాలోయింగ్ సంపాదించుకోవాలని ఆమె విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఇన్ని చేసినా ఆమెకు మూవీ ఆఫర్స్ రాకపోవడం గమనార్హం.

 

- Advertisement -