Jacqueline Fernandez : బాలీవుడ్ అగ్రతార జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈమెకు విపరీతమైన క్రేజ్ ఉంది.
బాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రస్తుతం చేతినిండా సినిమాలు ఉండి బిజీబిజీగా గడుపుతున్న హీరోయిన్స్ లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా ఒక్కరు. ఈ బాలీవుడ్ భామ సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ నార్త్ లోనే కాకుండా సౌత్ ఇండియాలో కూడా పాపులర్ అయ్యింది. ఈ ముద్దు గుమ్మను ఫాలో అయ్యే వారిలో మన తెలుగు కుర్రకారులు కూడా ఉండడం విశేషం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రంలో ఐటమ్ సాంగ్ కి చిందేసి జాక్వెలిన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.
సినిమాల్లో నటించడానికి ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా.. అందాలను ఆరబోస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది జాక్వెలిన్.. అలాగే సోషల్ మీడియాలో కూడా తన అందాలతో కుర్రకారులను రెచ్చగొడుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా జాక్వెలిన్ షేర్ చేసిన స్టన్నింగ్ లుక్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి. దీంతో ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ తను నటించిన బచ్చన్ పాండే త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా మూవీ ప్రమోషన్స్ తో బిజీ బిజీగా ఉంది. ఈ సినిమా మార్చి 22న విడుదల కానుంది. అలాగే జాక్వెలిన్ బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం ‘అటాక్’ మూవీ లో కూడా చేస్తుంది.