Kajal Aggarwal : కాజల్ అగర్వాల్ తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లోకి నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో నటించిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా కాజల్ అగర్వాల్.. తొలి సినిమాతోనే నటన పరంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత చందమామ చిత్రంలో నటించి.. బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఈ మూవీతో కాజల్ తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోని చిరంజీవి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున, వంటి స్టార్ హీరోలతో జత కట్టి వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో ఓ రేంజ్లో దూసుకెళ్లింది. అతి తక్కువ సమయంలో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగింది కాజల్ అగర్వాల్…
అలాగే ఇటీవల తన క్లోజ్ ఫ్రెండ్ అయినా గౌతమ్ కిచ్లూ ని పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత మెగాస్టార్ ఆచార్య చిత్రంలో కాజల్ నటించిందని తెలుస్తుంది. అయితే ఎందుకో తెలియదు కానీ కాజల్ వివాహం చేసుకున్న తర్వాత సినిమాలు చేయలేదు..అయితే ఇటీవలే కాజల్ ప్రెగ్నెంట్ అయినట్లు తన భర్త గౌతమ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫాలోవర్స్ తో పంచుకున్నాడు. దీంతో ప్రస్తుతం ఈ కాజల్ కడుపు తో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు ఫాలోవర్స్ తో సామాజిక మాధ్యమం ద్వారా పంచుకుంటూ ఉంటుంది.
అయితే తాజాగా కాజల్ తన భర్తతో కలసి దిగిన ఫొటోలు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి.