Keerthy Suresh : కీర్తి సురేష్ ..పరిచయం అక్కర్లేని పేరు..’మహా నటి’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసింది బ్యూటీ కీర్తి సురేష్.. టాలీవుడ్ లోకి ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటించిన ‘నేను శైలజ’ అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది అందాల ముద్దుగుమ్మ….వైవిధ్యమైన పాత్రలో నటిస్తూ తెలుగు ప్రేక్షకులను కీర్తి సురేష్ అలరిస్తూ వస్తుంది. సినిమలో తన పాత్ర చిన్నదా పెద్దదా ప్రాధాన్యత ఉన్నదా లేదా అనేది పట్టించుకోకుండా తనకు కథ నచ్చితే చాలు..ఏ పాత్ర చేయడానికైనా సిద్ధమవుతోంది. ఈ రోజుల్లో గ్లామరస్ పాత్రలకే డిమాండ్ ఉన్న కాలంలో.. కీర్తి సురేష్ మాత్రం అందుకు భిన్నంగా ట్రెడిషనల్ పాత్రలు మాత్రమే ఎంచుకుంటూ స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీ ని దున్నేస్తుంది.
ఆన్నాతే మూవీలో సూపర్ స్టార్ రజినీకాంత్ సోదరిగా నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో కీర్తి సురేష్ కి చాలా సినిమాల ఆఫర్లు వచ్చాయిట. పెద్ద స్టార్ హీరో పక్కన చేసే అవకాశం రావడంతో మిగతా సినిమాలకు నో చెప్పినట్లు తెలుస్తుంది. అయితే అందులో శ్యాం సింగరాయ చిత్రం కూడా ఒకటని తెలుస్తుంది. ఇటీవల విడుదలైన శ్యాంసుందర్ చిత్రంలో సాయిపల్లవి నటించిన పాత్రలో మొదట నిర్వాహకులు కీర్తి సురేష్ ని సంప్రదించారట.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి సినిమాతో కీర్తి సురేష్ కి ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. ఆ సావిత్రి బయోపిక్ లో అద్భుతంగా నటించి విమర్శకుల నుండి కూడా ప్రశంసలు అందుకుంది కీర్తి.. అలాగే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న బోళా శంకర్ చిత్రంలో.. చిరు చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ కనిపించబోతుంది. అదేవిధంగా న్యాచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న దసరా చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా చేసింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ వేడుక హైదరాబాదులో జరిగింది. ఈ నేపథ్యంలో కీర్తి సురేష్ బ్లాక్ శారీలో దర్శనమిచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.