Kriti Sanon : కృతి సనన్… ఈ బాలీవుడ్ హీరోయిన్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన 1 నేనొక్కడినే చిత్రంలో హీరోయిన్ గా టాలీవుడ్లోకి అరగటం చేసింది.
ఆ సినిమాలో ఈ బాలీవుడ్ బ్యూటీ నటనలో మంచి ప్రతిభనే కనబర్చిన కానీ.. ఆ సినిమా ఆడకపోవడంతో ఆమెకు ఊహించని దెబ్బ తగిలింది. ఆ తర్వాత దోచేయ్ చిత్రంలో నాగ చైతన్య సరసన నటించింది. అయితే ఈ సినిమాతోనైనా టాలీవుడ్ లో నిలదొక్కుకోవాలని ఆమె అనుకోగా.. కానీ ఆ సినిమా కూడా ఫ్లాప్ అవడంతో ఆమెకు తెలుగులో అవకాశాలు కరువయ్యాయి.
తెలుగులో ఆమె నటించిన రెండు సినిమాలు అట్టర్ ఫ్లాప్ కావడంతో ఎవరు ఆమెను హీరోయిన్ గా పెట్టుకోడానికి ముందుకు రాలేదు.. కానీ ఈ బ్యూటీ కి బాలీవుడ్లో పెద్ద పెద్ద మూవీ ఆఫర్స్ రావడంతో ఆమె ఫేటే ఒక్కసారిగా మారిపోయింది. బాలీవుడ్ లో గ్లామరస్ పాత్రలతో నటిస్తూ అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
ఇటు వరుస సినిమాలు చేస్తూ అటు ఫోటో షూట్ లతో నిత్యం వార్తల్లో నిలుస్తుంది. కెమెరా ముందు తన అందాలను పరిచి కుర్రకారుల మతి పోగొడుతుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ మెరిసే రెడ్ డ్రెస్ లో అందాలను ఒలకబోస్తూ కనువిందు చేసింది. దీంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రస్తుతం కృతి సనన్ ఇండియా మూవీ అయినా ఆదిపురుష్ లో ప్రభాస్ తో కలిసి నటిస్తుంది.