Kriti Shetty : ఉప్పెన సినిమాతో బెబామ్మ గా వెండితెరకు పరిచయమైన కృతి శెట్టి .. చేసిన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించింది. ఆ సినిమా తర్వాత ఆమెకు వరుస మూవీ ఆఫర్స్ క్యూ కట్టాయి. ఉప్పెన సినిమాలో కృతి శెట్టి రొమాంటిక్ సీన్స్ లో అదరగొట్టడంతో.. అందరి దృష్టి ఆకర్షించింది. అంతేకాక ఆ సినిమాలో వైవిద్యమైన వేరియేషన్స్ తో నటన ప్రతిభను ఆమె చూపెట్టింది. ఆ సినిమా తరువాత బంగార్రాజు చిత్రంలో నాగచైతన్యకు జోడిగా నటించింది. అలాగే శ్యామ్ సింగ రాయ్ సినీమాలో నాని సరసన నటించింది. ఆ తరువాత సుదీర్ బాబు, హీరో రామ్ లతో ఒక్కో చిత్రం చేసింది.
అయితే ఆ చిత్రాలు అంతగా ఆడలేదు. ఇదిలా ఉంటే కృతి శెట్టికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కృతి శెట్టి వెంట ఒక స్టార్ హీరో కొడుకు వెంటపడుతున్నాడని ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్లి వేధిస్తున్నాడని పలు వెబ్ సైట్లు కథనాలు ప్రచురించాయి. ఈ విషయం పై ఒకసారి ఆమె స్పందించింది. అవన్నీ రూమర్స్ మాత్రమేనని ఎవరు పట్టించుకోవద్దని తేల్చిచెప్పేసింది.