Lahari Shari : బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టి లేడీ అర్జున్ రెడ్డి గా గుర్తింపు సంపాదించుకున్న లహరి షారి గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టక ముందు కొన్ని చిత్రాల్లో నటించినా ఆమెకు సరైన గుర్తింపు లభించలేదు. కానీ బిగ్ బాస్ షో లో అడుగుపెట్టిన తర్వాత తన రేంజే మారిపోయింది.
సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కూడా బాగానే పెరిగారు. బిగ్ బాస్ లో లహరి ఉన్నది రెండు మూడు వారాలే అయిన.. మంచి గుర్తింపును సంపాదించుకుంది. దీంతో సినిమా అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో వరుస మూవీ ఆఫర్లు అందుకుంటూ బిజీ బిజీగా గడుపుతుంది ఈ బిగ్ బాస్ బ్యూటీ. ఇదిలా ఉంటే లహరి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది.
ఈ మేరకు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు ఫాలోవర్స్ తో పంచుకుంటూ ఉంటుంది. రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ ఖరీదైన బైక్ ను కొనుగోలు చేసినట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.
దీనికి సంబంధించిన ఫోటోలను నెట్టింట్లో షేర్ చేసింది. ఎట్టకేలకు బైక్ కొన్నాను. ఈ బైక్ నాకు చాలా నచ్చింది.. చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా నాకు బైక్ సౌండ్ చాలా నచ్చిందని పేర్కొంది.
దీంతో ఆ ఫోటోలు చూసిన అని మాస్టర్ వంటి పలువురు సెలబ్రిటీలు లహరికి కంగ్రాట్స్ చెప్పారు.
ఇక ఈ లగ్జరీ BMW G 310 GS మోడల్‌కి చెందిన ఈ బైక్ సుమారు రూ.3-3.5లక్షలు వరకు ఉంటుందని తెలుస్తోంది. లహరి నటియే కాదు.. తను యాంకర్ గా జర్నలిస్టుగా కూడా పని చేసింది.
యంగ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరో గా నటించిన అర్జున్ రెడ్డి చిత్రంలో నర్సుగా లహరి అద్భుతంగా నటించింది. ఆ తర్వాత మళ్లీ రావా, సారీ నాకు పెళ్లైంది, జాంబి రెడ్డి తదితర చిత్రాల్లో నటించి మంచి ఫేం తెచ్చుకుంది.
ఇటీవలే బంగార్రాజు చిత్ర ప్రమోషన్ లో భాగంగా ఈ బ్యూటీ నాగార్జున నాగచైతన్య లను ఇంటర్వ్యూ చేసింది. ప్రస్తుతం లహరి ఇటు సినిమాలు చేస్తూ..అటు బుల్లితెర పైన కూడా ఫోకస్ పెట్టింది.