Malavika Mohanan : మాళవిక మోహనన్ అంటే ఎవరికి పెద్దగా తెలియకపోవచ్చు కానీ మాస్టర్ సినిమా హీరోయిన్ అంటే ఎవరైనా ఇట్టే గుర్తు పట్టేస్తారు. మాళవిక మోహనన్ మూవీ ఇండస్ట్రీలోకి వచ్చి 8 ఏండ్లు అయిన.. నటించింది మాత్రం కేవలం ఐదు చిత్రాలే.. అయితే 2019లో సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన పేట మూవీలో అద్భుతంగా నటించి సంచలనం సృష్టించింది.
కానీ ఇటీవలే మాస్టర్ చిత్రంతో మాళవిక మోహనన్ కి మంచి గుర్తింపు రావడంతో..స్టార్ హీరోయిన్ గా మారింది. ఈ మాస్టర్ బ్యూటీ నటించింది ఐదు చిత్రాలే అయినా… తన అందం, అభినయంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. దీంతో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మాళవిక మోహనన్ కొనసాగుతుంది.
ఇదిలా ఉంటే తాజాగా అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయింది. పరవాలు చూపిస్తూ రచ్చ లేపింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇక సినిమాల విషయానికొస్తే.. మాళవిక ప్రస్తుతం తమిళంలో హీరో ధనుష్ నటిస్తున్న “మారన్` చిత్రంలో నటిస్తుంది. అలాగే హిందీ లో “యుద్ర” అనే మూవీలో నటిస్తోంది. మలయాళ ఇండస్ట్రీ ద్వారా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయినా మాళవిక… “పట్టం పోలె” 2013 లో వచ్చిన చిత్రంతో అరిగేట్రం చేసింది. కెరియర్ మొదట్లోనే గ్లామర్ డోస్ పెంచి.. సినిమా అవకాశాలను సొంతం చేసుకుంటుంది. వరుస సినిమాలు చేసుకుంటూ… ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో దూసుకెళుతోంది.