Manmadudu: మన్మధుడు. ఈ చిత్రం గురించి టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ చిత్రం విడుదలై ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఈ చిత్రంలోని సన్నివేశాలు మాత్రం ఇప్పటికి సినీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఈ చిత్రంలోని కామెడీ సన్నివేశాలు అలాగే మనసుకు హత్తుకునే డైలాగులు, ఎమోషన్స్ ప్రేక్షకులను కట్టి పడేసాయి. ముఖ్యంగా ఈ చిత్రంలోని ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలలో కనిపించిన హీరోయిన్ అన్షు అంబానీ కి అయితే టాలీవుడ్ సినీ ఫ్యాక్షకులు ఫిదా అయ్యారు.
కానీ దురదృష్టవశాత్తు అన్షు అంబానీ మన్మధుడు చిత్రంలో నటించిన తర్వాత మళ్ళీ టాలీవుడ్ సినిమాల్లో నటించలేదు. ఈ క్రమంలో తన చిన్ననాటి స్నేహితులను ప్రేమించి పెళ్లి చేసుకుని విదేశాలలో సెటిల్ అయ్యింది. ఆ తర్వాత మళ్లీ సినిమా ఇండస్ట్రీ వరకు కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇక బ్రతుకుతెరువు కోసం తనకంటూ సొంతంగా ఓ బట్టలు బోటీక్ పెట్టుకొని అలా లైఫ్ లీడ్ చేస్తోంది.
అయితే అన్షు అంబానీ సినిమాలకి దూరంగా ఉంటున్నప్పటికీ ఈమధ్య సోషల్ మీడియా మాధ్యమాలలో మాత్రం బాగానే యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన అందమైన ఫోటోలు, వీడియోలు వంటివి షేర్ చేస్తోంది. ఈ క్రమంలో చాలామంది టాలీవుడ్ నెటిజన్లు ఇండస్ట్రీకి మళ్లీ మీ రీఎంట్రీ ఎప్పుడని కామెంట్లు రూపంలో అడుగుతున్నప్పటికీ అన్షు అంబానీ మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే అన్షు అంబానీ తన అధికారిక సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేసినటువంటి కొన్ని ఫోటోలు హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవలే తన స్నేహితులతో కలిసి జరిగినటువంటి ఈ పార్టీలో భాగంగా తన స్నేహితులతో కలిసి ఫోటోలు దిగింది.
అయితే ఈ ఫోటోలలో అన్షు అంబానీ కొంతమేర మద్యం గ్లాస్ తో కనిపించడంతో ఒక్కసారిగా ఆమె అభిమానులు అవ్వక్కయ్యారు. అలాగే మన్మధుడు, రాఘవేంద్ర చిత్రాలలో చాలా పద్ధతిగా కనిపించిన అన్షు ఒక్కసారిగా ఇలా మందు గ్లాసుతో కనిపించేసరికి ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నాను. మరికొందరు మాత్రం విదేశాలలో ఫాస్ట్ కల్చర్ ఉంటుందని కాబట్టే అందులో తప్పేముందని అంటున్నారు.