Manchu Lakshmi : మంచు లక్ష్మి.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమార్తె గా అందరికీ సుపరిచితమే. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లోకి ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో 2011లో వచ్చిన ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాతో మంచు లక్ష్మి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో నటనలో లక్ష్మీ మంచి మార్కులే కొట్టేసింది. తండ్రి మోహన్ బాబు నట వారసత్వాన్ని ఒంటబట్టించుకుని వరుస సినిమాలు చేసుకుంటూ ఇండస్ట్రీలో దూసుకెళ్లింది. ఎన్నో సినిమాల్లో నటించిన లక్ష్మి కి సరైన గుర్తింపు రాలేదు. దీంతో ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేసుకుంటూ కాలాన్ని వెళ్లబోస్తుంది. లక్ష్మి వెండితెరపైకి రాకముందే బుల్లితెరలో ఎంట్రీ ఇచ్చింది. పలు టీవీ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది.
ఆమె లాస్ వెగాస్’, ‘డెసపరేట్ హౌజ్ వైవ్స్’ లాంటీ కొన్ని అమెరికన్ టెలివిజన్ షోస్‌లలో కూడా నటించింది. ఇండస్ట్రీలో లక్ష్మీ నటిగానే కాకుండా నిర్మాతగా కూడా మంచి గుర్తింపు సాధించారు. అయితే మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది. ఈ మధ్య మంచు డాటర్ గ్లామర్ పై దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. వైవిద్యమైన ఫోటో షూట్ లతో సోషల్ మీడియాని హీట్ ఎక్కిస్తుంది. తీరిక దొరికినప్పుడల్లా ఫోటోలకు ఫోజ్ ఇస్తూ.. కుర్రాళ్ల మతి పోగొడుతుంది. దీంతో ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా మంచు లక్ష్మ ఛమ్కీల అంగీలేసి’ సాంగ్ కి చిందులు వేసింది. ఆ డాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో అది నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తుంది.