Mrunal Thakur : మృణాల్ ఠాకూర్.. తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేని పేరు.. సీతారామం చిత్రంతో సీతగా తెలుగు ఆడియోస్ గా మంచి గుర్తింపు సంపాదించింది మృణాల్.. ఆ చిత్రంలో అద్భుతమైన నటన కనబరిచి.. కుర్రాళ్లకు క్రష్ గా మారింది.
అందం అభినయంతో అన్ని ఇండస్ట్రీలో ఈ ముద్దుగుమ్మ దూసుకుపోతుంది. వాస్తవానికి ఈమె నార్త్ అయినప్పటికీ తెలుగు ఆడియోస్ గా అలవోకగా ఆకట్టుకోగలిగింది. దీంతో ఆమెకు టాలీవుడ్ లో స్టార్ హీరోలతో నటించే అవకాశాలు వస్తున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.
ఆమె నటన ఒక ఎత్తు అయితే.. చూపు తిప్పుకొలేని అందం మరొక్క ఎత్తు.. ఆ చిత్రంలో ఎమోషనల్ సీన్స్ లో కూడా అద్భుతమైన నటన కనబరిచింది. ఇలాంటిది మరొక సినిమా పడితే ఆమె టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఈ ముద్దుగుమ్మ సినిమాల్లో చీరలో లంగా వోణిలో సాంప్రదాయంగా కనిపించిన.. సోషల్ మీడియాలో మాత్రం వైవిద్యమైన ఫోటో షూట్ లు చేస్తూ నిత్యం సంచలనంగా మారుతుంది. అందాలు ఆరబోస్తూ రెచ్చిపోతుంది. తన అందాల సోయగాలను కుర్రాళ్లకు ఎరగవేస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది. దీంతో ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.