Nabha natesha : నభా నటేష్.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఈ ముద్దుగుమ్మ కన్నడ చిత్రాలతో వెండితెరకు పరిచయమైన ప్రస్తుతం టాలీవుడ్ లో స్థిరపడిపోయింది. తెలుగులో వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది ఈ కన్నడ బ్యూటీ… ఎనర్జిటిక్ స్టార్ రామ్ అగ్ర డైరెక్ట్ దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబో లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో హీరోయిన్ గా నభా నటేష్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ సినిమాలో యాటిట్యూడ్ ఉన్న అమ్మాయి రోల్ లో నభా నటేష్ అద్భుతంగా నటించి మార్కులు కొట్టేసింది. ఆ సినిమా కూడా భారీ హిట్ కొట్టడంతో ఇండస్ట్రీలో నభా నటేష్ కి మంచి గుర్తింపు లభించింది.
అనంతరం డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్ వంటి చిత్రాల్లో నభా నటేష్ మెరిసింది. ఇటీవలే నితిన్ మ్యాస్ట్రో చిత్రంలో కూడా అమె నటించింది. అయితే ఆ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయినా ఈ బ్యూటీ ఇటు సినిమాలు చేస్తూ అటు సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతుంది. ఈ మేరకు తాజాగా అందాలు ఆరబోసిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెటింట్లో వైరల్ గా మారాయి.