Nandita swetha : ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది నందితా. ఆ తర్వాత ప్రేమ కథ చిత్రం, అక్షర వంటి చిత్రాల్లో కూడా నటించింది. అలాగే తమిళంలో కూడా పలు చిత్రాల్లో నటిస్తోంది. ఇవేకాకుండా ఈ ముద్దుగుమ్మ పలు టీవి షోలో జడ్జిగా కూడా వ్యవహరిస్తుంది.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతోమంది సెలబ్రిటీలు అయ్యారు. అలాగే పలువురు ప్రముఖులు కూడా ట్రోల్స్ బారినపడిన వారు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజుల్లో సెలబ్రిటీలు ఏదైనా చిన్న తప్పు చేసిన సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తారు నెటిజన్లు.
ముఖ్యంగా హీరోయిన్లు ఎక్కువగా ట్రొల్స్ బారిన పడుతుండడం మనం చూస్తూ ఉంటాం. దీంతో కొందరు నెటిజన్లు హద్దు మిరి హీరోయిన్ ని బాడీ షేవింగ్ చేస్తూ ఉంటారు. అయితే వాటిని కొందరు నటి మణులు చూసి చూడనట్టు మూసధోరణి తో వదిలేస్తారు. మరికొందరేమో ట్రోలర్స్ కి గట్టి కౌంటర్ ఇస్తారు. బాడీ షేవింగ్ చేసిన సదురు నెటిజన్ కి దిమ్మతిరిగిపోయే సమాధానం చెబుతారు.
ఈ మేరకు తాజాగా హీరోయిన్ నందితా శ్వేతా బీచ్ లో అందాలు ఆరబోస్తూ కెమెరాకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ ముద్దుగుమ్మ ఇంతగా అందాల ఆరబోస్తున్న మూవీ ఆఫర్స్ రాకపోవడం గమనర్హం.
ప్లీజ్ మీ బాడీ స్ట్రక్చర్ పై శ్రద్ధ పెట్టండి. దయచేసి రోజు వర్క్ ఔట్ చేసి.. మీ బాడీ షేప్స్ ని సక్రమంగా మెయింటెయిన్ చేయండి. ఆంటీలా అవుతున్నావ్ అంటూ ఓ నెటిజన్ అప్పట్లో నందితా ఫోటోలపై కామెంట్ చేశాడు.
నందిత ఆ కామెంట్ ని స్క్రీన్ షాట్ తీసి ఇన్స్టాగ్రామ్ స్టోరీ లో షేర్ చేస్తూ… ఇలాంటి మనుషులతో నరకం. నేను దేవత ను కాను.. నేను కూడా మనిషినే..నాక్కూడా అందరిలా బాధలు ఉంటాయి. ఇలాంటి మాటలు ఎలా మాట్లాడుతారు.. నా బాడీని నేను ప్రేమిస్తాను. ఇప్పుడు నేను ఉన్న స్థితిని, కనపడే విధానాన్ని కూడా నేను ఇష్టపడతాను అంటూ రాసుకొచ్చింది.