Neha Sharma : టాలీవుడ్ లోకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిరుత చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన నేహా శర్మ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిరుత సినిమా తర్వాత వరుణ్ సందేశ్ కుర్రాడు చిత్రంలో కూడా ఈమె అద్భుతంగా నటించింది. అయితే ఈ సినిమా ఆడకపోవడంతో నేహా శర్మ కు సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో తెలుగు సినిమాలో ఈ ముద్దు గుమ్మ కనిపించక చాలా రోజులే అయింది. అయితే ఈ అందాల తారకు మూవీ ఆఫర్స్ రాకపోయినా..కానీ సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫోటోలతో రచ్చ లేపుతుంది.
ఇండస్ట్రీలో బుడిబుడి అడుగులు వేస్తున్న..కానీ క్లీవాజ్ షోలతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంటుంది ఈ బ్యూటీ. మతులు పోగొట్టే అందాలతో మెంటలెక్కిస్తుంటుంది. సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయిన అందాలు ఆరబోస్తూ హాట్ ఫోటో షూట్లతో కుర్రాళ్ళుకు పిచ్చెక్కిస్తుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తమిళ్ పంజాబీ మలయాళం భాషల్లో అడపాదడపా సినిమాలు చేసుకుంటూ తన సినీ కెరీర్ని నెట్టుకుంటూ వస్తుంది. గతేడాది రిలీజైన పంజాబిలో ‘ఇక్ సంధు హుందా సి’ ఫిల్మ్ లో నటించింది. హిందీలో జోగిరా సారా రా రా’ లో బాలీవుడ్ నటుడు నవాజుద్దన్ సిద్దిఖ్ కి జోడిగా నేహా నటిస్తుంది.
ఈ రొమాంటిక్ కామెడీ సినిమాకి డైరెక్టర్ కుషన్ నాండి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే నేహా శర్మ తెలుగులో ఏ చిత్రాల్లో కనిపించకపోవడంతో అభిమానులు కొంచెం నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఫాలోవర్స్ తో పంచుకుంటు ఉంటుంది. తాజాగా కొన్ని హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలని చూస్తున్నా కుర్రకారులను ఊపిరాడకుండా చేస్తుంది నేహా శర్మ.