Neha Shetty : నేహా శెట్టి.. తెలుగు కుర్రకారులకు పరిచయం అక్కర్లేని పేరు..మెహబూబా చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. గల్లీ రౌడీ చిత్రంలో సందీప్ కిషన్ కి జోడి గా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరేంది. తన అందం అభినయంతో కుర్రకారులను మంత్ర ముగ్ధుల్ని చేసింది. ఆ తర్వాత అఖిల్ హీరోగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో కూడా ఈ బ్యూటీ మెరిసింది. ఇటీవలే బ్లాక్ బస్టర్ హిట్ అయిన డీజే టిల్లు చిత్రంలో అసాధారణ ప్రతిభ కనబరిచి నేహా శెట్టి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ సినిమా చూసిన వారు ఎవరైనా నేహా శెట్టి అందాలకు ఫిదా అవ్వాల్సిందే.
డీజే టిల్లు సినిమాతో నేహా శెట్టి యూత్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది. క్యూట్ గా కనిపిస్తూ హాట్ ఫిజిక్ తో కుర్రకారును ఆమె ఆకట్టుకుంటుంది. ఇటు సినిమాలతోనే కాకుండా అటు ఫోటో షూట్లతో అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. ఇప్పుడే ఇండస్ట్రీలో మంచి మూవీ అవకాశాలను దక్కించుకుంటున్న నేహా శెట్టి..కిరణ్ అబ్బవరంతో ఒక చిత్రంలో నటించబోతుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి రతినం కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఆమె అందాలను చూపెడుతూ సమ్మర్ లో మరింత హీట్ పెంచేసింది.