Nidhi Agerwal : టాలీవుడ్ లోకి సవ్యసాచి అనే చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్.. ఆ తర్వాత అఖిల్ మిస్టర్ మజ్ను సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ అక్కినేని సోదరుల సినిమాలు అంతగా ఆడకపోయినా కానీ…అందులో నటించిన నిధి అగర్వాల్ మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో క్రియేటివ్ మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నటించి కుర్రకారుల హృదయాలను గెలుచుకుంది ఈ నిధి అగర్వాల్. టాలీవుడ్ లో నిధి చేసినవి మూడు సినిమాల్లో అయినా యూత్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది.
ఇక ఈ చిన్నది సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ ఆక్టివ్ గా ఉంటుంది. అయితే ఈ అందాల తార ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలను ఫాలోవర్స్ తో పంచుకుంటూ ఉంటుంది. తన ఎద అందాలతో సోషల్ మీడియాలో రచ్చ లేపుతుంది. తన అందచందాలను ఆరబోసి కుర్రాళ్ళకు పిచ్చెక్కిస్తుంది.
ఈ మేరకు తాజాగా నిధి అగర్వాల్ అంద చందాలను ఆరబోస్తూ రచ్చ చేసింది. ఆ ఫోటోలో ఉన్న నిధి ని చూస్తే భువి నుండి దివికి దిగివచ్చిన దేవకన్యలా ఉందని పలువురు కామెంట్లు పెడుతున్నారు.
చీరలో మెరిసిపోతున్న ఈ ఇస్మార్ట్ బ్యూటీని చూస్తే కుర్రాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం నిధి అగర్వాల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “హరిహర వీరమల్లు ” చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమాలో ఆమె నర్తకి పాత్రలో కనిపించబోతోంది. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కతున్న ఈసినిమా హిట్ పైన నిథి అగర్వాల్ ఎన్నో ఆశలు పెట్టుకుంది . అదేవిధంగా నిధి తమిళ్ ఇండస్ట్రీ లో కూడా పలు చిత్రాలు చేస్తోంది. అలాగే కన్నడలో నిధి కొన్ని సినిమాలు చేస్తోంది.