Niharika : “ఢీ” షో తో బుల్లితెరకు యాంకర్ గా పరిచయమైన మెగా డాటర్ నిహారిక… ఆ తర్వాత హీరోయిన్ గా పలు చిత్రాల్లో కూడా నటించింది. మెగా ఫ్యామిలీ నట వారసత్వాన్ని ఒంటబట్టించుకుని పలు వెబ్ సిరీస్ లో సందడి చేసింది. టాలీవుడ్ లో ఎన్ని ఫ్యామిలీలు ఉన్న మెగా ఫ్యామిలీ అనేది ప్రత్యేకం. అందుకే వాళ్లకు సంబంధించిన ఏ విషయమైనా ఒక సంచలనమే. మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన ఏకైక హీరోయిన్ నిహారిక. మెగా ఫ్యామిలీ లో నిహారిక ని ఎంత అల్లారుముద్దుగా చూసుకుంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఈ మేరకు ఇటీవలే నిహారిక చైతన్య ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. పెళ్లయిన తర్వాత నిహారిక సినిమాలకు దూరంగా ఉంటుంది. ఎందుకని ఆరా తీస్తే..చైతన్య కు నిహారిక సినిమాలో నటించడం అంటే ఇష్టం లేదట.. అయితే నిహారిక సినిమాలు మాత్రమే చెయ్యట్లేదు.. ఎప్పుడు బుల్లితెర ఈవెంట్ లలో సందడి చేస్తూ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ.. తన పర్సనల్ విషయాల్ని ఫాలోవర్స్ తో పంచుకుంటూ ఉంటుంది
ఇదిలా ఉంటే ఇటివలే మెగా డాటర్ జోర్డాన్ దేశంలో వెకేషన్ ఎంజాయ్ చేసింది. అయితే గత కొద్ది రోజుల నుండి నిహారిక చైతన్య విడాకులు తీసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో రూమర్లు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా నిహారిక నాలుగు నెలల తర్వాత ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోలను షేర్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. అందులో లంగా వోణీలో ట్రెడిషనల్‌గా కనువిందు చేసింది. ఆ ఫోటోల కింద నేటిజన్లో రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. కొందరు చైతన్య నువ్వు విడాకులు తీసుకోబోతున్నారట కదా నిజమేనా అంటూ కామెంట్లు పెడుతున్నారు.