Pooja Hegde : వరుస హిట్లతో.. చేతి నిండా సినిమాలతో ఇండస్ట్రీలో దూసుకెళ్తున్న పూజా హెగ్డే గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ కొడుతుండడంతో పూజాకి ఇండస్ట్రీలో డిమాండ్ పెరిగింది. దీంతో ఈ అమ్మడు రెమ్యూనరేషని కూడా భారీగానే పెంచింది. అయితే ఈ బుట్ట బొమ్మ ముంబై లో అప్పట్లో ఇల్లు కడుతున్నట్లు పలు సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవలె ముంబైలోని తన కొత్త ఇంట్లోకి పూజా గృహ ప్రవేశం చేసింది. ఈ విషయాన్ని స్వయంగా తానే ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ తో పంచుకుంది.
ఈ ముద్దుగుమ్మ ప్రొఫెషనల్ లైఫ్ తో పాటు పర్సనల్ లైఫ్ ని కూడా అద్భుతంగా ఆస్వాదిస్తుంది. వివిధ ప్రదేశాలు చుట్టేస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది. టాలీవుడ్లో అగ్రహీరోయిన్ గా కొనసాగిన పూజా ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ గా రాణిస్తుంది. చేతి నిండా పెద్ద పెద్ద సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న పూజా రీసెంట్గా తన కుటుంబంతో మాల్దీవులకి వెళ్లింది. అక్కడ ఈ బ్యూటి సేద తీరింది. మాల్దీవుల్లో పూజా హెగ్డే ఎంజాయ్ చూస్తున్న వీడియోను సోషల్ మీడియాలో ఫాలోవర్స్ తో పంచుకుంది. దీంతో అప్పట్లో ఆ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.
ఇదిలా ఉంటే తాజాగా పూజా అందాలతో రెచ్చిపోయింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
నాగ చైతన్య ఒక లైలా కోసం చిత్రంతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పూజా హెగ్డే.. ఆ తర్వాత మెగా హీరో వరుణ్ తేజ్ తో ముకుంద చిత్రంలో నటించింది. . పూజ సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం లో హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భవదీయుడు భగత్ సింగ్ చిత్రంలో కూడా పూజా హెగ్డే నటించనున్నది.