Pooja Ramachandran : పూజా రామ్ చంద్రన్.. తెలుగు ప్రేక్షకులకు అంతగా గుర్తు పట్టలేక పోవచ్చు.. కానీ ఈమె మన తెలుగు చిత్రాల్లో పలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలో మెరిసింది.
వైవిధ్యమైన పాత్రల్లో ఈమె నటించింది. ఈమె ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త కూడా నటుడే కావడం. ఫిట్నెస్ అంటే ప్రాణమిచ్చే ఈ ముద్దుగుమ్మ.. తనకన్నా ఫిట్నెస్ లో ఎక్కువ శ్రద్ద చూపే వ్యక్తినే వివాహం చేసుకుంది.
ఆమె భర్త ఎవరో కాదు జాన్ కొక్కెన్.. ఈయన పలు సినిమాల్లో విలన్ గా నటించాడు. ఇటివలే విడుదలైన ‘సార్పట్ట’ సినిమాలో ఆర్యకు కాంపిటీటర్ గా జాన్ కొక్కెన్ అద్భుతంగా నటించాడు.
అయితే పూజా, జాన్ కొక్కెన్ లు ముందు ఎవరికి వారు వేరు వేరు వ్యక్తులతో మొదటి పెళ్లి జరిగింది.
అయితే ఏమైందో తెలియదు కానీ వారిద్దరూ మొదటి వారికి గుడ్ బై చెప్పి..వీరిద్దరూ ఒకటయ్యారు. హాయిగా సంసారం చేసుకుంటూ.. ఈ కపుల్స్ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు.
ఎప్పటికప్పుడు ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా వీరిద్దరూ ఫిట్నెస్ విషయంలో పోటీ పడుతూ ఉంటారు.
ఇదిలా ఉంటే తాజాగా పూజా బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో అవీ నెటింట్లో హల్ చల్ చేస్తున్నాయి.