Pragya Jaiswal : ప్రగ్యా జైస్వాల్ పరిచయం అక్కర్లేని పేరు.. ఇటీవలే విడుదలైన అఖండ చిత్రంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది ప్రగ్యా. ఈమె తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి అర్ధశతాబ్దపు దాటిన.. సరైన హిట్ తగ్గలేదు. కానీ తాజాగా అఖండ బ్లాక్ బస్టర్ తో .. ఓ హిట్ తన ఖాతాలో పడింది. అయితే అఖండ హిట్ తన సినీ కెరీర్ నే మార్చబోతుంది. ఇక నుండి తనను ఎవరైనా విశ్లేషించాలంటే..అఖండ ముందు అఖండ తరువాత అని వ్యాఖ్యానించాలి. అఖండ సినిమా విజయంతో ఈ ముద్దుగుమ్మ జోష్ లో ఉంది. ఇటు ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గానే ఉంటుంది. ఈ మేరకు లేటెస్ట్ ఫోటోలను ఫాలోవర్స్ తో పంచుకుంటూ ఉంటుంది.
టాలీవుడ్ లోకి డేగ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యా జైస్వాల్ తెలుగు తమిళ్ భాషలో వరుస సినిమాలు చేసుకుంటూ ఇండస్ట్రీలో దూసుకెళ్లింది. మెగా హీరో వరుణ్ తేజ్ కంచె సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. దీంతో ఆ సినిమా తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమెకు వరుస మూవీ ఆఫర్స్ క్యూలు కడతారు అని అందరూ అనుకున్నారు. కానీ గుంటూరోడు నక్షత్రం వంటి చిత్రాలో నటించిన అవి అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఆ తర్వాత జయ జానకి నాయక ఆచారి అమెరికా యాత్ర వంటి చిత్రాల్లో సందడి చేసింది. అయితే అఖండ హిట్ తో ప్రగ్యా కు వరుస సినిమా అవకాశాలు వస్తాయని ప్రేక్షకులు భావిస్తున్నారు.
ప్రస్తుతం ప్రగ్యా టర్కీలోని వివిధ ప్రదేశాలను సందర్శిస్తూ ఎంజాయ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రగ్యా అందాలను వడ్డించింది. దీంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అఖండ చిత్రంలో ఈ ముద్దు గుమ్మ.. శ్రావణ్య అనే ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తుంది. జగపతిబాబుకి, తనకి కూడా చాలా ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఇచ్చారు దర్శకుడు బోయపాటి. అలాగే ఆ సినిమా అంతా విజయం సాధించడానికి తమన్ మ్యూజిక్ కూడా ఒక కారణమని చెప్పాలి…