Priya Prakash Varrier : అప్పట్లో సినిమాల్లో చేయాలంటే ఆడిషన్స్ కోసం చెప్పులు అరిగేలా తిరిగిన కూడా ఆఫర్లు రాక పోతుండే. . కానీ ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత షార్ట్ ఫిలిం ద్వారా లేదా రీల్స్ ద్వారా పాపులర్ అయ్యి సినిమా అవకాశాలను సొంతం చేసుకున్న వారు ఎందరో ఉన్నారు. అదే కోవకు చెందింది బ్యూటీ ప్రియా వారియర్..’ఒరు ఆడార్ లవ్’ సినిమాలో కన్ను కొట్టే ఒక్క సీన్ తన జీవితానే మార్చేసింది. ఆ ఒక్క వీడియో వైరల్ అవడంతో దేశవ్యాప్తంగా పాపులర్ అయింది ప్రియా వారియర్ ..వింక్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ కేరళ కుట్టి పలు తెలుగు సినిమాల్లో నటిస్తోంది.
అయితే ఆ కన్ను కొట్టే సీన్ తర్వాత అందరూ ప్రియా పెద్ద హీరోయిన్ అవుతుందని అందరు భావించారు. కానీ అలా జరగలేదు. ఆ సినిమా తర్వాత మూవీ ఆఫర్లు ఈ అమ్మడుకు పెద్దగా రాలేదు. ఈ బ్యూటీ సినిమాల్లో సత్తా చాటలేకపోతున్నా కానీ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉంటూ ఫాలోవర్స్ తో టచ్ లో ఉంటుంది. ఈ మేరకు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఫాలోవర్స్ తో పంచుకుంటూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇటీవలే ప్రియా వారియర్ సోషల్ మీడియాలో ఓ వీడియోని షేర్ చేసింది. బోటులో తన ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది.
అందులో ప్రియా విన్యాసాలు చేయడంతో ఆ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇటీవలే తెలుగులో ప్రియ ఇష్క్ వంటి చిత్రాల్లో మెరిసింది. అయితే ఆ సినిమాలు ఆమెకు నిరాశనే మిగిల్చాయి. తనకు మంచి సినిమా పడితే తానేంటో ప్రూవ్ చేసుకోవాలనే యోచనలో ఆమె ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.