Priyanka Jawalkar : టాలీవుడ్లోకి టాక్సీవాలా అనే చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా ప్రియాంక జవాల్కర్.. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకుంటుంది. మొదట టాక్సీవాలా సూపర్ హిట్ అయినా.. ఈ ముద్దుగుమ్మకి అంతగా అవకాశాలు రాలేదు. కానీ కొన్ని నెలల తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో దూసుకెళ్తుంది. ఈ క్రమంలో ఎస్ఆర్ కళ్యాణమండపం, తిమ్మరుసు అనే సినిమాలతో హిట్లు కొట్టేసింది. ప్రస్తుతం ప్రియాంక జవాల్కర్ గమనం అనే చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అయింది.ఈ మేరకు క్రియ ఫిల్మ్ కార్ప్, కలి ప్రొడక్షన్స్ బ్యానర్లపై రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ చిత్రాన్నికి లేడీ డైరెక్టర్ సంజనా రావు దర్శకత్వం వహించారు. గమనం చిత్రం గత ఏడాది డిసెంబర్ 10 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. గమనం చిత్రంలో తన పాత్రకు ఎక్కువగా స్కోప్ ఉంటుందని ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది. డైలాగ్స్ ఎక్కువగా ఉండవని, కానీ కళ్లతోనే నటించాల్సి ఉంటుందని అది చాలా కష్టంగానే అనిపించిందని ప్రియాంక తెలిపింది. ఇలాంటి పాత్రను ఎంచుకోవడానికి కారణం ఏంటో కూడా ప్రియాంక వెల్లడించింది.
ఈ విధంగా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తే.. మిగతా దర్శకులు కూడా ఇలాంటి పాత్రలో నటించడానికి తనకు అవకాశాలు ఇస్తారని ప్రియాంక చెప్పుకొచ్చింది. ఇప్పటికే నన్ను అయితే కమర్షియల్ చిత్రాలకు మాత్రమే పనికొస్తానని అందరూ అనుకుంటారని ప్రియాంక తెలిపింది. సినిమాల్లో విలేజ్ అమ్మాయి పాత్రలు ఇవ్వమన్నా నువ్వు తెల్లగా ఉన్నావు కదా.. వద్దు అని దర్శకులు అంటున్నారట. మొత్తానికి అయితే ప్రియాంక నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేయడానికే మొగ్గు చూపుతుందన్నమాట..!