Priyanka Mohan : ప్రియాంక అరుల్ మోహన్… తెలుగు కుర్రకారులకు కొత్తగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఈ తమిళ్ హీరోయిన్ వచ్చిన తొలినాళ్లలోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.
తనకంటూ ఇండస్ట్రీలో ఒక గుర్తింపు సంపాదించుకుంది. తన అందం అభినయం నటనతో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఈ తమిళ్ బ్యూటీ నాని గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.
ఆ ఒక్క సినిమాతోనే క్యూట్ హీరోయిన్ గా కుర్రాళ్ళను మనసు గెలుచుకుంది ప్రియాంక.
ఆ సినిమా తర్వాత ఆమె తెలుగులో చెప్పుకోదగ్గ సినిమాలు ఏవి చేయలేదు. ఇటీవలే శర్వానంద్ శ్రీకారం తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అయితే మొదటి సినిమాలో సైలెంట్ అమ్మాయిగా కనిపించిన ప్రియాంక శ్రీకారం సినిమాలో వైలెంట్ అమ్మాయి గా కనిపించింది.
తెలుగులో ఈమె చేసింది రెండు సినిమాలే అయినా.. విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది.
అలాగే తమిళంలో కూడా యంగ్ హీరో శివకార్తికేయన్‌తో రెండు సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇప్పటికే వీరిద్దరి కలయికలో వచ్చిన డాక్టర్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.
అలాగే రెండో సినిమా డౌన్.. మూవీ షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది.
తమిళ్ లో ఇలా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టగానే.. సూర్యతో నటించే అవకాశాన్ని కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ.. ‘ఎత్తర్కుమ్ తునిందవన్’లో సూర్య కి జోడీగా ప్రియాంక నటించింది.
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో దూసుకెళ్తున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది.
లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఫాలోవర్స్ తో పంచుకుంటుంది. వీలు చిక్కినప్పుడల్లా తన అందాలను కెమెరాలతో బంధిస్తూ సోషల్ మీడియాకి హిట్ ఏకిస్తుంది.
ఈ నేపథ్యంలో తాజాగా ప్రియాంక తన అందాలతో మిస్మరిజ్ చేసే ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.