RaaiLaxmi : హీరోయిన్ లక్ష్మీరాయ్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె తెలుగుతో పాటు తమిళలో చిత్రాలు చేసి నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. విలక్షణమైన పాత్రల్లో అద్భుతంగా నటించి ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది లక్ష్మీ రాయ్.. ఈ అమ్మడికి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి. తెలుగులో ముఖ్యంగా బలుపు సర్దార్ గబ్బర్ సింగ్ వంటి చిత్రాలో నటించి తెలుగు వారికి దగ్గరైంది ఈ అమ్మడు. అలాగే మెగాస్టార్ తో రత్తాలు రత్తాలు సాంగ్ కి చిందేసి లక్ష్మీరాయ్ ఇండస్ట్రీలో పాపులారిటీని సంపాదించుకుంది. ఆ తర్వాత ఈ అమ్మడు బాలీవుడ్ కి చెక్కేసింది.
ఆ తర్వాత బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది.జూలి 2’లో రెచ్చిపోయి అందాలతో అదరగొట్టేసిన సంగతి తెలిసిందే. ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటుంది. తీరిక దొరికినప్పుడల్లా ఈ ముద్దుగుమ్మ ..టూర్ లకు వెళుతూ తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అలాగే పలు ప్రదేశాలను తిరుగుతూ అక్కడ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఆమె ఫోటోలు కోసం వేచి చూసే అభిమానులు ఎందరో ఉన్నారు.
క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ సాక్షి తో వివాహం చేసుకోక ముందు 2008-2009 లో హీరోయిన్ రాయ్ లక్ష్మీ తో ధోని ప్రేమలో పడ్డాడని వారిద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత ఐపీఎల్ సందర్భంగా పలు వేడుకలకు చెట్టపట్టాలు వేసుకుని వీరిద్దరూ కలిసి తిరగడం ఆ వార్తలకు బలాన్ని చేకూర్చాయి. ఈ క్రమంలో తన ఫ్రెండ్ సురేష్ రైనాతో కలిసి ధోనీ.. రాయ్ లక్ష్మీ ఇచ్చిన పార్టీలకు, ఆమె బర్త్‌డేలకు హాజరయ్యాడు. కానీ ఆ తర్వాత వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ… వారిద్దరూ విడిపోయారు.