Rakul Preet Singh : టాలీవుడ్లోకి వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ అనే చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేసుకుంటూ ఇండస్ట్రీలో ఎవరూ అందుకోలేనంత వేగంతో దూసుకెళ్తోంది.తెలుగుతో పాటు హిందీ తదితర భాషల్లో కూడా చిత్రాల్లో నటిస్తూ రకుల్ ప్రీత్ సింగ్ ఆయా ఇండస్ట్రీలలో సత్తా చాటుతోంది. అయితే ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ ఉంటుంది.
అప్పట్లో డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ పేరు ప్రముఖంగ వినపడడంతో.. ఆ వివాదం సర్వత్ర చర్చనీయంగా మారింది. అలాగే ఇటీవల తన పుట్టినరోజు నాడు తన ప్రేమ విషయాన్ని బహిర్గతం చేసిన సంగతి తెలిసిందే.రకుల్ అందరి హీరోయిన్ల లా కాకుండా విభిన్న పాత్రలు ఎంచుకుంటూ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా రాణిస్తుంది. చత్రీవాలి సినీమాలో కండోమ్ టెస్ట్ చేసే ఓ అమ్మాయి రోల్ లో నటించేందుకు రకుల్ ఓకే చెప్పింది.
ఈ నేపథ్యంలో రకుల్ దానిపై మరింత క్లారిటీ ఇచ్చింది. మనం ఎలా పుడుతున్నామో ప్రతి ఒక్కరికి తెలుసు.. అయితే ఆ విషయాన్ని ప్రస్తావించడానికి సిగ్గుపడుతూ ఉంటాం… అదే విషయాన్ని చత్రీవాలి సినీమాలో సిగ్గు లేకుండా అందరు తెలుసుకోవాలి.. ఈ సినిమాలో అసభ్యకరమైన సన్నివేశాలు ఏమీ ఉండవు. ఇలాంటి రోజుల్లో నటించాలంటే ప్రతి ఒక్క నటికి ఓ పెద్ద సవాలే.. అందుకే ఈ సినిమాలో నటించడానికి ఓకే చెప్పే ముందు మా తల్లిదండ్రులను అడిగితే.. చెయ్యమని నన్ను ఎంకరేజ్ చేశారు అంటూ ఆమె చెప్పింది.
ఫ్యామిలీ లైఫ్‌ను ప్రొఫెషనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేసుకుంటూ సినీ ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్‌గా రకుల్ కెరీర్ ని కొనసాగిస్తుంది. ఇక సినిమాల విషయానికొస్తే రకుల్ ప్రీత్ సింగ్ ప్రముఖ దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన కొండాపురం చిత్రంలో నటించింది. ఆ చిత్రంలో ఓబులమ్మ పాత్రలో ఈ పంజాబీ బ్యూటీ మెరిసింది. ఇక రకుల్ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది.
ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది రకుల్. ఈ ముద్దుగుమ్మ ఎంత బిజీగా ఉన్నా ఫిట్ నేస్ ని, డైట్ ని క్రమం తప్పకుండా ఫాలో అవుతూ ఉంటుంది. జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ ఫిట్ నెస్ మెయింటెయిన్ చేస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా రకుల్ అందాలను వడ్డించింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.