Rashmika : తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి “చలో” సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన.. గీత గోవిందం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. తన అందచందాలతో కుర్ర కార్ల మతి పోగొట్టేసింది.ఆ తర్వాత దేవదాస్, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించింది. అనంతరం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు చిత్రంలో క్యూటెస్ట్ హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకోగలిగింది.
అందుకే కావచ్చు రష్మిక కి నేషనల్ క్రష్ అనే బిరుదు కూడా వచ్చింది.. తెలుగుతో పాటు తమిళ్ కన్నడ ఇండస్ట్రీలలో కూడా రష్మీక సత్తా చాటుతోంది.ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు అక్టీవ్ గానే ఉంటుంది. లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఫాలోవర్స్ తో పంచుకుంటూ ఉంటుంది.అదేవిధంగా రష్మిక బాలీవుడ్లో కూడా ఇటీవలే హీరో సిద్ధార్థ్ మల్హోత్రా మిషిన్ మజ్ను చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
పాకిస్తాన్లో భారతదేశ గూడచారి సంస్థ నిర్వహించిన సీక్రెట్ ఆపరేషన్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాకు భాగిచి దర్శకత్వం వహించారు. పుష్ప సినిమా హిట్ తర్వాత రష్మిక కి స్టార్ హీరోయిన్ ఇమేజ్ వచ్చేసింది. స్టార్ హీరోల వరుస మూవీ ఆఫర్స్ రష్మిక కు క్యూ కడుతున్నాయి.
ఇదిలా ఉంటే ప్రస్తుతం రష్మిక ఒక్కో సినిమాకు నాలుగు నుంచి ఐదు కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుందని సమాచారం. అలాగే ఒక్కో యాడ్ చేస్తే డెబ్బై లక్షల నుంచి కోటి రూపాయల వరకు డిమాండ్ చేస్తోందట ఈ నేషనల్ క్రష్.. ఇప్పటివరకు రష్మిక 37 కోట్ల వరకు వెనకేసుకు వచ్చిందట. ఈమె ఏడాదికి సుమారుగా 5 మిలియన్ల వరకు సంపాదిస్తుందట. అలాగే రష్మిక కాస్ట్లీ రేంజ్ రోవర్ కారును కూడా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
సుమారు ఈ కారు విలువ కోటి పైగానే ఉంటుందట. 25 ఏళ్ల వయసులోనే రష్మిక ఇన్ని కోట్లు సంపాదించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అలాగే రష్మిక పుష్ప పార్ట్ 2 చిత్రంలో బిజీగా ఉంది. అదేవిధంగా విజయ్ తలపతి 66వ సినిమాలో కూడా నటిస్తుందట. ఈ నేపథ్యంలో ఆ సినిమా కోసం కాస్త ఫిట్నెస్ లో మార్పులు చేయాలని రష్మీక ఫిక్స్ అయ్యిందట.
ఇదిలా ఉంటే రష్మిక విజయ్ దేవరకొండ మధ్య ప్రేమాయణం కొనసాగుతుందనే ప్రచారం ఎప్పటినుండో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవలే రష్మిక షేర్ చేసిన ఒక ఫోటో ద్వారా మళ్లీ వాళ్ళిద్దరి ప్రేమాయణం తెరపైకి వచ్చింది. అయితే ఆమె గత కొన్ని రోజుల క్రితం మాల్దీవ్స్ వెళ్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ తర్వాత అనూహ్యంగా ఆమె వెళ్లిన తర్వాత విజయ్ కూడా వెళ్లడం సర్వత్ర ఆశ్చర్యానికి గురి చేసింది. విజయ్ ఎయిర్పోర్టులో పెట్టుకున్న కళ్లద్దాలను.. మాల్దీవ్స్ లో రష్మిక పెట్టుకుని ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో నెటిజన్లకు ఆమె అడ్డంగా దొరికిపోయింది.