Ritu Varma : రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన తొలి మూవీ పెళ్లి చూపులో హీరోయిన్గా నటించి.. ప్రేక్షకులకు పక్కింటి తెలుగమ్మాయిగా దగ్గరైంది రీతూ వర్మ.. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది రీతూ… అందం అభినయం కలగలిసిన ఈ బ్యూటీ మంచి మంచి సినిమాలు ఎంచుకుని.. ఇండస్ట్రీలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంది. ఇటీవలే నాగా శౌర్య వరుడు కావలెను సినిమాలో రీతూ వర్మ సందడి చేసింది. ఈ సినిమాలో తన నటనకు ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం తెలుగులో రీతూ వర్మ కు మంచి క్రేజ్ వచ్చింది.
ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మకు యూత్ లో మంచి పాపులారిటీ వచ్చింది. అందరూ హీరోయిన్ల లాగా హద్దులు దాటకుండా అందాలను ఆరబోస్తూ.. కుర్రకారుల హృదయాలను గెలుచుకుంది. దీంతో సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసే ఫోటోలు క్షణాల్లో ట్రెండింగ్ గా మారుతున్నాయి. అయితే రీతు వర్మ నటించిన సినిమాలన్నీ పరాజయం పాలవడంతో ఆమె కొంచెం నిరాశ లో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం రీతూ వర్మ శర్వానంద్ సరసన ‘ఒకే ఒక జీవితం’ అనే టైం ట్రావెల్ మూవీ లో నటిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా రీతు వర్మ సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు షేర్ చేసింది. అయితే ఆ ఫోటోలను చూస్తే రీతూ వర్మ గ్లామర్ విషయంలో కాస్త హద్దులు దాటుతుందేమోనని అనిపిస్తుంది.