Sadaa : హీరోయిన్ సదా గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె తన తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. అప్పట్లో ఈ ముద్దుగుమ్మ వస్తోందంటే చాలు..అందరికి మైండ్లో ఓ డైలాగ్ మెదిలేది. వెళ్లవయ్యా వెళ్లు వెళ్లూ’ అనే ఒక్క డైలాగ్ సదాకి మంచి పాపులారిటీని తెచ్చిపెట్టింది. మహారాష్ట్రలోని రత్నగిరిలో ఒక ముస్లిం కుటుంబంలో జన్మించిన సదా…. టాలీవుడ్ లోకి జయం సినిమాతో కథానాయికగా తన ప్రస్థానం మొదలు పెట్టింది. తను నటించిన తొలి సినిమానే బ్లాక్ బస్టర్ అవ్వడంతో సదా కి వరుస సినిమా అవకాశాలు క్యూలు కట్టాయి. ఆ తర్వాత తమిళ అగ్ర దర్శకుడు ఎన్.శంకర్ తో అపరిచితుడు సినిమాలో విక్రమ్ కి జోడిగా నటించి ఇండస్ట్రీలో హీరోయిన్ గా టాప్ రేంజ్ కి వెళ్ళిపోయింది.
దీంతో ఫిల్మ్ ఇండస్ట్రీని సదా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుందని అందరూ భావించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా..సదా సినీ కెరీర్ పట్టాలు తప్పింది. అయితే సదా కథల ఎంపికలో జాగ్రత్త పడకుండా.. కథలో హీరోయిన్ గా ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకోకుండా.. మూస ధోరణి తో సినిమాలు చేసుకుంటూ పోవడంతో.. తనకంటూ ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకోలేకపోయింది సదా. ఆమె నటించిన టక్కరి, నాగ సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి. దీంతో సినిమా అవకాశాలు తగ్గిపోయాయి..సదా చేతిలో ఒక్క సినిమా కూడా లేక పోయింది. అలాగే తమిళ ఇండస్ట్రీలో కొనసాగినా అక్కడ కూడా అవకాశాలు రాకపోవడంతో సదా సినిమాలకు దూరమైపోయింది.
అయితే జయం సినిమాలో నటించిన నితిన్, సదా లకు అదే డెబ్యూ మూవీ కావడం విశేషం. ఈ సినిమా షూటింగ్ సమయంలో సదా ఒక సీన్లో ఏడువాల్సి ఉంది.. కానీ సదాకు ఏడుపు రావడం లేదు. చాలా టేక్స్ తీసుకోవడంతో డైరెక్టర్ తేజకు ఆగ్రహంతో చెంప మీద ఒక్కటిచ్చాడట.. దీంతో సదా ఏడవడంతో దానినే సీన్ కింద తీయడంతో ఓకే అయ్యిందట.. ఈ విషయాన్ని సదానే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అప్పట్లో జయం సినిమా బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లను రాబట్టి డైరెక్టర్ తేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతానికైతే సదాకి యూట్యూబ్ ఛానల్ ఉంది.. అప్పుడప్పుడూ తనకు సంబంధించిన విషయాలను అందులో షేర్ చేస్తూ ఉంటుంది.