Sai Pallavi : ఫిదా సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి… తక్కువ సమయంలోనే ప్రేక్షకుల ఆదరణ పొందగలిగింది.
ఆ తరువాత ఎంసీఏ, పడి పడి లేచే మనసు సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది.
ఇటీవలే ఈ ముద్దుగుమ్మ నటించిన యువ సామ్రాట్ నాగ చైతన్య లవ్ స్టోరీ.. నాచురల్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సారంగా దరియా పాటకి ఎంత క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
అందులో సాయి పల్లవి డాన్స్ కి అయితే అందరూ ఫిదా అయ్యారు.
ఈ కాలంలో ఎక్సపోసింగ్ చేయకుండా.. ఫ్యాన్స్ ని సంపాదించుకోవడం కష్టం..కానీ సాయి పల్లవి ఎక్సపోసింగ్ చేయకుండా తన నటన, అభినయంతో సులువుగా అభిమానులు సంపాదించుకుంది.
సినిమా ఆడియో ఫంక్షన్లకు మూవీ ప్రమోషన్లకు పద్ధతిగా సాంప్రదాయంగా రావడం తెలుగులో మాట్లాడడం వంటివి ఆమెను తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసింది. దీంతో అందరూ ఆమెని నాచురల్ బ్యూటీ అని పిలుస్తూ ఉంటారు.
ఈమధ్య కాలంలో సాయి పల్లవికి స్టార్ హీరోకి ఉండే అంత క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. ఈమె లేడీ పవర్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకుంది.
ఈమె తెలుగుతోపాటు తమిళ్, మలయాళంలో కూడా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతుంది. ఇటీవలే విరాటపర్వం చిత్రంలో ఆమె కనిపించింది.
తాజాగా ఈ నేచురల్ బ్యూటీ స్లీవ్ లెస్ జాకెట్ లో కనువిందు చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.