Samantha : సమంత పరిచయం అక్కర్లేని పేరు. ఈ మధ్య నిత్యం ఏదో విధంగా వార్తలో నిలుస్తూనే ఉంది. సమంతా చేసే కామెంట్స్..సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఈ అందాల ముద్దుగుమ్మ ఇటు సినిమాలు చేస్తూనే అటు ఫోటో షూట్లలో పాల్గొని ఫోటోలకు ఫోజులు ఇస్తూ.. ఇలా ఒకటేంటి ఎన్నో పనులు చేస్తూ నిత్యం ప్రజల నోట్లో సమంత పేరును నానేలా చేస్తుంది. నాగ చైతన్య తో విడిపోయిన తర్వాత సమంతా సినిమాలపై దృష్టి సారించింది. ఈ మేరకు వరుస ప్రాజెక్ట్స్ కి ఓకే చెప్పింది. టాలీవుడే కాదు బాలీవుడ్ హాలీవుడ్ ని దున్నేయాలనే యోచనలో సమంత ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే ఇటీవలే విడుదలైన అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పాన్ ఇండియా మూవీ పుష్ప చిత్రంలో సమంత ఓ ఐటమ్ సాంగ్ కి చిందేసింది. ఊ అంటావా మావా..ఊహు అంటావా మావా అంటూ ఎద అందలతో రెచ్చిపోయి కుర్రకారులకు సెగలు పుట్టించింది. ఈ సినిమా ఐటెం సాంగ్ కోసం సమంత కోటిన్నర రూపాయలు తీసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అయితే ఒక ఐటమ్ సాంగ్ కే కోటిన్నర రూపాయలు అంటే భారీ మొత్తమే..అసలీకైతే సామ్ తెలుగులో ఒక సినిమా కి రెండు నుంచి రెండున్నర కోట్ల వరకు తీసుకుంటూ ఉంటుంది. అయితే ఒక ఐటమ్ సాంగ్ కే సమంత కోటిన్నర రెమ్యూనరేషన్ తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది.
ఇదిలా ఉంటే తాజాగా సమంత శకుంతల మూవీ ప్రమోషన్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.