Samantha : జిమ్‌లో స‌మంత అందాల విందు.. బరువులు మాములుగా ఎత్తడం లేదుగా..వీడియో వైర‌ల్‌ !

Bharath Cine Desk

Samantha : సమంత.. పరిచయం అక్కరలేని పేరు..టాలీవుడ్ లోకి ఏం మాయ చేసావే అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ సమంత.. తక్కువ సమయంలోనే మంచి పాత్రల్లో నటించి ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. అలాగే ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో అద్భుత నటనను కనబరిచి దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది. అయితే ఎంతో ఇష్టంగా ప్రేమించి పెళ్లిచేసుకున్న నాగ చైతన్య సమంత లు ..ఇటీవలే కొన్ని అనివార్య కారణాలు వల్ల తమ వివాహిత జీవితానికి స్వస్తి పలికిన సంగతి తెలిసిందే. అయితే చై తో విడాకుల తీసుకున్న తర్వాత సామ్ సినిమాలపైనే దృష్టి పెట్టింది

ఇదిలా ఉంటే సమంతకు ఆరోగ్యంపై శ్రద్ద ఎక్కువ అన్నా సంగతి తెలిసిందే. ఈ మేరకు సమంత ఫిట్ గా ఉండడానికి జిమ్ములో కసరత్తులు చేస్తూ ఉంటుంది. అలాగే యోగా, ధ్యానం వంటివి కూడా చేస్తుంది సామ్.. ముఖ్యంగా చైతో సామ్ విడిపోయిన తరువాత.. మెంటల్ ప్రెషర్ ని తట్టుకోవడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుంది. ఈ క్రమంలో సమంత వ‌ర్కవుట్స్ చేసిన వీడియో ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. అవి నెట్టింట్లో తెగ వైరల్ గా మారుతాయి.

ఇదిలా ఉంటే తాజాగా సమంత జిమ్ లో బరువులెత్తే వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.

అయితే ఇటీవలే విడుదలైన అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పాన్ ఇండియా మూవీ పుష్ప చిత్రంలో సమంత ఓ ఐటమ్ సాంగ్ కి చిందేసింది. ఊ అంటావా మావా..ఊహు అంటావా మావా అంటూ ఎద అందలతో రెచ్చిపోయి కుర్రకారులకు సెగలు పుట్టించింది.

ఇక సినిమాల విషయానికొస్తే సమంత గుణశేఖర్ తెరకెక్కించిన శాకుంతలం మూవీ షూటింగ్‌ని పూర్తి చేసింది. అలాగే సమంత యశోద అనే చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రానికి హరి – హరీష్ దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నాడు. యశోద చిత్రంలో రమేశ్, మురళీ శర్మ, వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు తమిళ కన్నడ మలయాళం హిందీ భాషల్లో ఏకకాలంలో ఒకేసారి విడుదల చేస్తున్నారు.

- Advertisement -