Samantha : మరోసారి సమంత అందాల ట్రీట్.. పరువాలు ఆరబోస్తూ కుర్రాళ్ళ మతి పోగొడుతోందిగా!

Bharath Cine Desk

Samantha : అందాల తార సమంత గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఈ మధ్య నిత్యం ఏదో విధంగా వార్తలో నిలుస్తూనే ఉంది. సమంతా చేసే కామెంట్స్..సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఈ అందాల ముద్దుగుమ్మ ఇటు సినిమాలు చేస్తూనే అటు ఫోటో షూట్లలో పాల్గొని ఫోటోలకు ఫోజులు ఇస్తూ.. ఇలా ఒకటేంటి ఎన్నో పనులు చేస్తూ నిత్యం ప్రజల నోట్లో సమంత పేరును నానేలా చేస్తుంది. నాగ చైతన్య తో విడిపోయిన తర్వాత సమంతా సినిమాలపై దృష్టి సారించింది. ఈ మేరకు వరుస ప్రాజెక్ట్స్ కి ఓకే చెప్పింది. టాలీవుడే కాదు బాలీవుడ్, హాలీవుడ్ లో కూడా సత్తా చాటాలనే యోచనలో సమంత ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే తాజాగా స‌మంత షేర్ చేసిన ఫోటో అందరి దృష్టిని ఆకర్షించింది. అందాలు ఆరబోస్తూ కెమెరాకు పోజులు ఇచ్చిన సమంత… కుర్రకారుల మతి పోగొడుతుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో ట్రెండింగ్ గా మారింది.

 

 

అయితే ఇటీవలే విడుదలైన అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పాన్ ఇండియా మూవీ పుష్ప చిత్రంలో సమంత ఓ ఐటమ్ సాంగ్ కి చిందేసింది. ఊ అంటావా మావా..ఊహు అంటావా మావా అంటూ ఎద అందలతో రెచ్చిపోయి కుర్రకారులకు సెగలు పుట్టించింది.

ఇక సినిమాల విషయానికొస్తే సమంత గుణశేఖర్ తెరకెక్కించిన శాకుంతలం మూవీ షూటింగ్‌ని పూర్తి చేసింది. అలాగే సమంత యశోద అనే చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రానికి హరి – హరీష్ దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నాడు. యశోద చిత్రంలో రమేశ్, మురళీ శర్మ, వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు తమిళ కన్నడ మలయాళం హిందీ భాషల్లో ఏకకాలంలో ఒకేసారి విడుదల చేస్తున్నారు.

 

 

- Advertisement -