Sara Ali Khan : ఈ రోజుల్లో అమ్మాయిలు ఎంత అప్డేటెడ్ గా ఎవరిమీద ఆధారపడకుండా ఇండిపెండెంట్ గా ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం.. తమ కెరియర్ కి సంబంధించిన డెసిషన్ లు కూడా తమంతట తామే తీసుకొని ముందుకు వెళ్తున్నారు. అదే బాటలో యంగ్ హీరోయిన్లు కూడా నడుస్తున్నారు. తమకు కాబోయే వాడు ఎలా ఉండాలో ముందే ఒపీనియన్ ఫామ్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ వరుడని ఎంపిక చేసుకోవడంలో బాలీవుడ్ బ్యూటీలు ఇంకా ముదుర్లు అని చెప్పాలి. కొందరు పెళ్లికి ముందే సహజీవనం వంటి కాన్సెప్ట్ లను ఫాలో అవుతున్నారు. కొందరేమో నేను పెళ్లికి ముందు ప్రేమించుకుని ఆ తర్వాత బ్రేకప్ చెప్పుకొని ఎవరి దారిన వారు జీవిస్తున్నారు.
అయితే బాలీవుడ్ బ్యూటీ సైఫ్ ఆలీ ఖాన్ కూతురు తన పెళ్లి గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. ఇప్పుడిప్పుడే స్టార్ హీరోలతో జతకట్టి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకుంటుంది సారా..వరస సినిమాలు చేస్తూ స్టార్ స్టేటస్ వైపు అడుగులు వేస్తుంది. ఇప్పటికే సింబా, కేదార్‌నాథ్, అతరింగీ రే లాంటి సినిమాలతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది సారా. ఈ మధ్యే విడుదలైన ‘అతరంగీ రే’లో సారా నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, అగ్రహీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటించారు. సారా ఆ చిత్రంలో ఇద్దర్ని ప్రేమించే అమ్మాయి గా కనిపించింది.
ఈ సినిమా సక్సెస్ మీట్ లో సారా అలీ ఖాన్ తన పెళ్లి గురించి ఓపెన్ అయింది. తనకు తన తల్లే సర్వస్వమని.. తన మదర్ సహాయం లేకుండా ఏ పని చేయలేను అంటూ సారా చెప్పుకొచ్చింది. చివరికి నేను వేసుకునే డ్రెస్సులు దానిపై మ్యాచింగ్ అయ్యే గాజులు కూడా అమ్మే సెలెక్ట్ చేస్తుందని సారా అలీ ఖాన్ తెలిపింది.
అలాగే తనను పెళ్ళి చేసుకునే వాడు కూడా అమ్మకు నచ్చాలని.. తనకు కాబోయే వాడు తను, అమ్మతో కలిసి ఉండాలని..ఈ కండిషన్ కి ఒప్పుకుంటే పెళ్లికి సై అంటానాన్ని సారా అలీ ఖాన్ వెల్లడించింది. మొత్తానికి అయితే సారా తనను పెళ్లి చేసుకోవాలనుకునే వాడు ఇల్లరికం రావాల్సిందేనాని తేల్చి చెప్పేసింది. ఇదిలా ఉంటే తాజాగా సారా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.