Shriya saran : టాలీవుడ్ లోకి ఇష్టం అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రేయ.. రెండు దశాబ్దాలుగా చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. శ్రేయ తెలుగుతో పాటు తమిళ్, కన్నడ హిందీ మలయాళ చిత్రాల్లో కూడా నటించి .. అక్కడ కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక తెలుగులో అయితే మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేశ్, ప్రభాస్, మహేశ్ బాబు, రవితేజ లాంటి స్టార్ హీరోలతో జతకట్టి.. బ్లాక్ బస్టర్స్ తన ఖాతాలో వేసుకుంది. అలాగే తలైవా రజినీకాంత్ తో శివాజీ చిత్రంలో జత కట్టి మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. అయితే కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ అందాల ముద్దుగుమ్మ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించడానికి రెడీ అవుతుంది.
ఇప్పటికే పాన్ ఇండియా మూవీ జక్కన్న దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో ఒక కీలక పాత్రలో శ్రియ నటించింది. అలాగే ఇటీవలే గమనం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని సంజన రావు దర్శకత్వం వహించారు. అలాగే ఈ చిత్రంలో హీరోయిన్లు నిత్యామీనన్, ప్రియాంక జవాల్కర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ బ్యూటీ 2018 సంవత్సరంలో ఆండ్రీ కోస్చీవ్‌ని వివాహం చేసుకుంది. అయితే కొంతకాలంగా దాచి పెట్టిన విషయాన్ని ఇటీవలే శ్రేయ శరన్ తెలియజేసింది.. అదేంటంటే తన తల్లిని అయ్యానని తనకో పాప పుట్టిందని సోషల్ మీడియాలో ఆఫీసల్ గా శ్రేయ ప్రకటించింది.
అయితే శ్రేయ దంపతులు రొమాన్స్ తో ఎప్పుడు రచ్చలేపుతుంటారు. అయితే బీచ్ ఒడ్డున, పబ్లిక్ ప్రదేశాల్లో రొమాన్స్ చేయడం శ్రీయ- ఆండ్రీ కోస్చీవ్ జోడీకి కొత్తేమీ కాదు.. తమ పర్సనల్ లైఫ్ ని ఆస్వాదిస్తూ.. హాట్ ఫోజులతో కుర్రాళ్ళకు సెగలు పుట్టిస్తున్నారు. శ్రేయ దంపతుల వ్యవహారం పట్ల కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత పబ్లిక్ గా ముద్దులు,రొమాన్స్ ఏంటని ? ఇంత బరి తెగించారెంటానీ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా శ్రీయ అందాలు అరబోసింది ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.