Shruti Hassan : ప్రముఖ నటుడు కమల్ హాసన్ కుమార్తె శృతి హసన్.. అతి తక్కువ సమయంలో తన నటనతో ప్రేక్షకులందరని మెప్పించి..స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. 2003 లో సినీ ఇండస్ట్రీకి వచ్చి.. తెలుగు తమిళ్ హిందీ వంటి వివిధ భాషల్లో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది. సినిమాలో శ్రుతి.. క్యారెక్టర్ చిన్నదా పెద్దదా అన్ని అసలు అలోచించదు.. నచ్చితే చేసేస్తోంది. అలాగే శృతిహాసన్ నటిగానే కాకుండా సింగర్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోయిన్ గా నిలిచిన ఈ మల్టీ టాలెంటెడ్ లేడీ.. వ్యక్తిగత కారణాల వల్ల కొన్ని నెలలు ఇండస్ట్రీకి దూరమైంది. కానీ తాజాగా కామ్ బ్యాక్ ఇచ్చి… మళ్లీ వరుస పెట్టి సినిమాలు చేస్తుంది.
శృతిహాసన్ సోషల్ మీడియాలో ఎప్పుడు అక్టీవ్ గా ఉంటుంది. శృతి తన బాయ్ ఫ్రెండ్ శాంతాను హజారికాతో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు తన బాయ్ ఫ్రెండ్ తో దిగిన ఫోటోలను, వీడియో లను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటుంది. కరోనా కారణంగా ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ లో వీరిద్దరూ కలిసి ఒకటే ఫ్లాట్లో ఉంటూ సహజీవనం చేసిన సంగతి తెలిసిందే.
బాలకృష్ణ హీరగా నటించిన వీర సింహారెడ్డి చిత్రంలో శ్రుతి హీరోయిన్ గా చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా… అందులో శ్రుతి చీర కట్టులో అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా మారాయి.
ఇక సినిమాల విషయానికొస్తే ఇటీవల రవితేజ సరసన క్రాక్‌లో ఈ భామ అదరగొట్టింది. అలాగే శృతి హాసన్ తెలుగులో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రంలో కూడా మెరిసింది. ప్రస్తుతం పాన్ ఇండియా సాలర్ చిత్రంలో నటిస్తోంది..